సుదీర్ఘ విరామం తరువాత ఈరోజు పోలవరం ప్రాజెక్టుకు వెళ్లిన సీఎం చంద్రబాబు వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టు పరిస్ధితి, పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తదుపరి చేపట్టాల్సిన పనులపై ఇంజనీర్లు, అధికారులతో అక్కడే రివ్యూ నిర్వహించారు. డయాఫ్రం వాల్‌, ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌, ఇతర నిర్మాణ పనులు ఉండబోతున్నాయనే అంశంపై అంశాలపై చర్చించారు. చంద్రబాబు గతంలో సీఎంగా ఉండగా పోలవరానికి ప్రతీ సోమవారం వెళ్లేవారు. అయితే ఆ తర్వాత ప్రభుత్వం మారిపోవడంతో అవన్నీ అలాగే నిలిచిపోయాయి. దీంతో ఇప్పుడు తాజా పరిస్ధితిని పరిశీలించి పనుల పూర్తికి షెడ్యూల్ విడుదల చేసేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. కేంద్రం నుంచి సహకారం అందుతున్న నేపథ్యంలో ఇది అసాధ్యం కూడా కాదని భావిస్తున్నారు.

కాగా రాష్ట్ర విభజన తర్వాత 2014లో సీఎం హోదాలో చంద్రబాబు పోలవరం పనులను పరుగులు పెట్టించిన సంగతి తెలిసిందే. 2019 నాటికి సుమారు72 శాతం పనులు పూర్తి చేయించారు. స్పిల్‌వే గేట్లు కూడా పెట్టి ఒక కొలిక్కి తెచ్చారు. ఎగువ కాఫర్‌ డ్యామ్‌, డయాఫ్రంవాల్‌లను నిర్మించారు. దిగువ కాఫర్‌ డ్యాం పనులు మొదలుపెట్టారు. కుడి ప్రధాన కాలువ పనులను ఒక కొలిక్కి తేగా, ఎడమ ప్రధాన కాలువ పనులు కూడా పరుగులు పెట్టించిన సంగతి తెలిసిందే. మరోపక్క పోలవరం విద్యుత ప్రాజెక్టు పనులను కూడా మొదలు పెట్టించారు. కానీ 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో రివర్స్‌ టెండరింగ్‌, ఎంక్వయిరీలు అంటూ జాప్యం చేసి, చివరకు ప్రాజెక్టును కదలకుండా చేసిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు పోలవరం నిర్మాణ పనుల్లో వేగం పెంచేందుకు నడుం బిగించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos