కుప్పం :  తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు విస్తృతంగా పర్యటించారు. కుప్పాన్ని ‘స్వర్ణ కుప్పం’గా తీర్చిదిద్దే లక్ష్యంతో వందల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఒకే రోజు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. పర్యటనలో భాగంగా రూ.10 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఆర్డీఓ, ఏఎస్పీ కార్యాలయ భవనాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం కుప్పం మున్సిపాలిటీలో రూ.38 కోట్ల విలువైన వివిధ ప్రభుత్వ అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహించారు. రూ.3.30 కోట్లతో నిర్మించిన సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్, మెటీరియల్ రికవరీ కేంద్రాన్ని ప్రారంభించారు.

మల్లనూరులో 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.2.70 కోట్లతో నిర్మించనున్న జూనియర్ కళాశాల పనులకు కూడా ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు. వ్యవసాయ ఫీడర్లకు విద్యుత్ అందించేందుకు ఏర్పాటు చేసిన 15 మెగావాట్ల పీఎం కుసుమ్ సోలార్ ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

 ప్రకృతి సేద్యమే శ్రీరామరక్ష.. రైతులకు సీఎం సూచన.. 

‘స్వర్ణ కుప్పం’ పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పలువురు లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. హంద్రీనీవా కాలువ ద్వారా ప్రయోజనం పొందుతున్న రైతుతో మాట్లాడిన ఆయన.. వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి సేద్యం వైపు అడుగులు వేయాలని సూచించారు. వాతావరణంలో మార్పుల కారణంగా ఎల్‌నినో వంటి పరిస్థితులు ఏర్పడి వర్షాభావ పరిస్థితులు ఎదురవుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. సేంద్రీయ ఎరువులు, బయోచార్ వంటి విధానాలను ఉపయోగించి భూసారాన్ని పెంచడంతో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవాలని రైతులకు సూచించారు.

“ప్రకృతి సేద్యం శ్రీరామరక్ష. ఈ విధానాన్ని మరింత విస్తరించాలి” అని సీఎం పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఇప్పటికే 20 లక్షల మంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని, ఈ సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. భూములను ఖాళీగా ఉంచకుండా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు.

 ప్రతి ఇంటి నుంచి ఓ పారిశ్రామికవేత్త.. 

పీ4 కార్యక్రమం కింద లబ్ధి పొందిన లక్ష్మి అనే మహిళ తన అనుభవాలను సీఎం చంద్రబాబుతో పంచుకున్నారు. ప్రభుత్వం, టీవీఎస్ సంస్థ సహకారంతో ఇటుకల బట్టీ ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధితో పారిశ్రామికవేత్తగా ఎదిగినట్లు ఆమె తెలిపారు.దీనిపై స్పందించిన చంద్రబాబు.. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. టీవీఎస్, అదానీ, మెగా వంటి సంస్థలు 8,900 కుటుంబాలను దత్తత తీసుకుని వారికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నాయని తెలిపారు.

అదేవిధంగా కుప్పంలోని ఓ కంపెనీలో ఉద్యోగం పొందిన సురేఖ అనే యువతిని సీఎం అభినందించారు. ప్రతి కుటుంబంలోనూ స్టార్టప్‌లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎదగాలని ఆకాంక్షించారు. కుప్పం నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు వ్యవసాయం, ఉపాధి, పారిశ్రామిక రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ ‘స్వర్ణ కుప్పం’ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Sports Teachers Protest Against YSRCP | Mega DSC | స్పోర్ట్స్ టీచర్ల పోరాటం | Amaravati Galam

తాజా వార్తలు

18-19-11-0911.jpg

నిరుపేదల వైద్యానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి అండ.. మెరుగైన వైద్యం కోసం బాధితులకు ఎల్‌ఓసీ పత్రాల అందజేత
2026-09-21 Time: 06:19:11

18-02-43-0943.jpeg

శాప్ కార్యాలయంలపై వైసీపీ గూండాల దాడి దుర్మార్గం.. మెగా డీఎస్సీపై ఉద్దేశపూర్వకంగా జగన్ దుష్ప్రచారం.. మంత్రి కొలుసు పార్థసారధి
2026-09-21 Time: 06:02:43

17-51-57-0957.jpg

పచ్చదనం పరిమళం..పిఠాపురంలో నగర వనాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
2026-09-21 Time: 05:51:57

17-16-45-0945.jpg

గురువుల కష్టార్జితంపై ‘ఫేక్’ ముద్ర వేస్తారా? ప్రతి ఆరోపణకూ ఆధారాలతో సమాధానం చెబుతాం.. విజయవాడ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్
2026-09-21 Time: 05:16:45

17-04-22-0922.jpg

స్వర్ణ కుప్పం దిశగా అడుగులు.. పలు అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం
2026-09-21 Time: 05:04:22

Related Videos