గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే, సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర రెండో కుమార్తె నాగసాయి వైదీప్తి - కెవిన్ రామ్‌ల వివాహ వేడుక బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. గుంటూరులోని శ్రీ కన్వెన్షన్‌లో జరిగిన ఈ శుభకార్యానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. రాజకీయాలకు అతీతంగా ఇద్దరు సీఎంలు ఒకే వేదికపై కనిపించడం విశేషం. ఈ వివాహ వేడుకకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజుతో పాటు మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, సవిత, దేవినేని ఉమామహేశ్వరరావు, వేం నరేందర్ రెడ్డి తదితర ప్రముఖులు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరు విచ్చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మర్యాదపూర్వక స్వాగతం పలికారు. పెళ్లి వేడుకలో రాజకీయ చర్చలు పక్కన పెట్టి నాయకులంతా సరదాగా గడిపారు. ఈ క్రమంలో మంత్రి నారా లోకేశ్, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె మధ్య జరిగిన సంభాషణ అందరినీ ఆకట్టుకుంది. వధూవరులను ఆశీర్వదించిన అనంతరం లోకేశ్ నరేంద్ర కుమార్తెతో మాట్లాడుతూ.. "త్వరలో మహిళా రిజర్వేషన్లు వస్తున్నాయి.. నువ్వు ఎమ్మెల్యే అవ్వడానికి రెడీగా ఉండు" అంటూ చలోక్తి విసిరారు. దీనికి ధూళిపాళ్ల నరేంద్ర వెంటనే స్పందిస్తూ.. "మాకే ఎర్త్ పెడితే ఎలా బాబూ?" అంటూ నవ్వుతూ రియాక్ట్ అయ్యారు. పక్కనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు ఈ సరదా సంభాషణకు పగలబడి నవ్వారు. నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపు వంటి అంశాలపై కూడా నాయకుల మధ్య అనధికారికంగా చర్చలు జరిగినట్లు సమాచారం. వివాహ వేడుక అనంతరం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు తిరుగుపయనమయ్యారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos