ఆంధ్రప్రదేశ్‌కు మరో దిగ్గజ ఐటీ కంపెనీ రాబోతోంది. విశాఖపట్నంలో నూతన ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నట్లు కాగ్నిజెంట్ అధికారికంగా ప్రకటించింది. నగరంలోని కాపులుప్పాడలో 22 ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్లు కాగ్నిజెంట్ ‘ఎక్స్’లో తెలిపింది. 'విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోయే నూతన క్యాంపస్‌తో సుమారు 8 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఏఐ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ రంగంలో ఉద్యోగాలు వస్తాయి. 2026 నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తామని, కాగ్నిజెంట్ విస్తరణకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు' అంటూ ట్వీట్ చేసింది.
కాగ్నిజెంట్ దేశంలోని ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒకటిగా ఉంది.. విశాఖపట్నంలో రూ.1,583 కోట్లతో ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయబోతోంది. మంత్రి లోకేష్ కాగ్నిజెంట్‌కు స్వాగతం పలుకుతూ ఇటీవల ట్వీట్ చేశారు. విశాఖపట్నంలో 22 ఎకరాల్లో ఈ క్యాంపస్‌ను ఏర్పాటు చేయబోతున్నారని.. కాగ్నిజెంట్‌కు ఎకరా భూమిని 99 పైసలకే కేటాయిస్తున్నామన్నారు. ఈ కంపెనీ రాకతో 8వేల ఉద్యోగాలు వస్తాయని అన్నారు. కాగ్నిజెంట్ 2026నాటికి తాత్కాలికంగా కార్యకలాపాలు మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. 2029 నాటికి పూర్తి స్థాయి క్యాంపస్ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. కాగ్నిజెంట్ దేశంలో ద్వితీయ శ్రేణి నగరాల్లో విస్తరించాలనే లక్ష్యంతో ఈ క్యాంపస్‌ను ప్రారంభిస్తోంది. విశాఖపట్నం మౌలిక సదుపాయాలకు అనుకూలంగా ఉందని కాగ్నిజెంట్ భావిస్తోంది. అంతేకాదు ఈ క్యాంపస్ డిజిటల్ ఎకానమీని మరింత వేగవంతం చేస్తుందని మంత్రి నారా లోకేష్ అంటున్నారు.
దేశంలో ఇతర నగరాల్లో కూడా కాగ్నిజెంట్ విస్తరిస్తోంది.. ఈ మేరకు భువనేశ్వర్, ఇండోర్‌లో కొత్త కేంద్రాలను ఏర్పాటు చేసింది. గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో ఫైనాన్స్ హబ్‌ను కూడా ప్రారంభించింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా కాగ్నిజెంట్ ఉద్యోగుల్లో 70 శాతం మంది భారత్‌లోనే ఉన్నారని చెబుతున్నారు. అందుకే కంపెనీ ఇక్కడ భారీగా పెట్టుబడులు పెడుతోంది. కాగ్నిజెంట్ డిజిటల్ ఎకానమీని మరింత అభివృద్ధి చేస్తుందని భావిస్తున్నారు. మొత్తానికి కాగ్నిజెంట్‌ను ఏపీకి తీసుకురావడంలో ఏపీ ప్రభుత్వం సక్సెస్ అయ్యింది.. త్వరలోనే మరికొన్ని కంపెనీలు కూడా రాష్ట్రానికి వస్తాయంటోంది ప్రభుత్వం.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos