రుషికొండ భవనాల పైన కీలక మంత్రాంగం సాగుతోంది. ఈ భవనాల వినియోగం పైన పలురకాల ప్రతిపాదనలు చర్చకు వచ్చాయి. ఆతిథ్య రంగానికి చెందిన ప్రముఖులు తమ ప్రతిపాదనలను ప్రభుత్వం ముందు ఉంచి.. తమ అభిప్రాయాలను వెల్లడించారు. కొంతమంది నిర్వహణకు ముందుకు వస్తూ.. తమ డిమాండ్లను వివరించారు. దీని పైన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి ఇచ్చిన ప్రతిపాదనల పైన చర్చించి .. కీలక అంశాలను వెల్లడించింది.

రుషికొండ ప్యాలెస్‌ను ఎలా వినియోగించాలన్న అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ 3వ భేటీ ఈరోజు బుధవారం జరిగింది. సమావేశంలో చర్చించిన అంశాలను ఏపీ ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి ప్యాలెస్‌ను ఇచ్చే అంశంపై పరిశీలిస్తున్నామని.. కానీ, కొంతమంది హోటల్ కోసం అదనపు స్థలం కావాలని అడిగారని చెప్పారు. రుషికొండ కింద ఉన్న 9 ఎకరాల స్థలంలో ఏడు ఎకరాలు సీఆర్‌జెడ్ నిబంధనలోకి వస్తాయని.. ఆ 7 ఎకరాల్లో ఎలాంటి నిర్మాణం చేయకూడదన్నారు. తమకు ఇదో సవాల్‌గా మారిందన్నారు. శుక్రవారం మరోసారి సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. కాగా.. రుషికొండ నిర్మాణాలపై మళ్ళీ నిర్మాణాలు చేసే అవకాశం ఉందని.. పైన రెండు ఫ్లోర్లు వేసేందుకు అనుకూలంగా ఉందని వివరించారు.

కాగా.. రుషికొండ చివరి రెండు బ్లాక్‌లు ప్రజలకు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు, టూరిస్ట్ అవసరాల కోసం ఉంచుతామని చెప్పారు. తాజ్ గ్రూప్, లీలా హోటల్ గ్రూప్, అట్మాస్పియర్ కోర్ వంటి గ్రూప్ హోటల్స్ ముందుకు వచ్చాయని మంత్రి పయ్యవుల కేశవ్ పేర్కొన్నారు. కందుల దుర్గేశ్ సైతం స్పందించారు. మరోసారి రుషికొండ వినియోగంపై చర్చ జరుగుతుందన్నారు. అనేక ప్రపోజల్స్ వస్తున్నాయని.. వైబుల్ ప్రాజెక్ట్ ఏంటి అనే అంశంపై దృష్టి పెట్టామని తెలిపారు. సముద్రం ఆటు పోట్ల వల్ల రుషికొండ కింద 9 ఎకరాల్లో 2 ఎకరాలు మాత్రమే అందుబాటులోకి వస్తాయన్నారు. ఏడు ఎకరాలు సీఆర్‌జెడ్ నిబంధనల పరిధిలో ఉంటాయని మంత్రి దుర్గేశ్ వెల్లడించారు. ఈ నెల 29న జరిగే మంత్రివర్గ సమావేశంలో రుషికొండ భవనాల పైన చర్చించి.. నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోందని అధికారులు అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos