ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న వేళ సీఎం చంద్రబాబు, తనయుడు నారా లోకేష్ తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో ఆయన సంక్షేమ పథకాలతో పాటు వాలంటీర్లపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన పెన్షన్ల పెంపు గురించి మాట్లాడుతూ కేవలం ఏపీలోనే ఇది సాధ్యమైందన్నారు. అలాగే సంక్షేమ పథకాల లబ్దిదారులకు చంద్రబాబు కీలక సూచనలు చేసారు. 2024-25 మధ్య కాలంలో 34 వేల కోట్ల పింఛన్ చెల్లించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. హామీ ఇచ్చినట్లుగానే పింఛన్ ఒకేసారి పెంచామన్నారు. ఏడాదికి రూ.34 వేల కోట్ల భరోసా పింఛన్ ఇస్తున్నది ఏపీలోనే అని అన్నారు. పింఛన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరినీ గౌరవిస్తామని, తీసుకున్న డబ్బును దుబారా ఖర్చు చేయకూడదని లబ్దిదారులకు సూచించారు. సంక్షేమంపైనే ఎప్పుడూ ఆధారపడకూడదని కూడా సూచించారు. సంక్షేమాన్ని ఆర్థిక చేయూతగా మార్చుకోవాలన్నారు.

అలాగే వాలంటీర్ల వ్యవస్ధపైనా చంద్రబాబు స్పందించారు. వాలంటీర్లు ఉంటేనే ప్రభుత్వ కార్యక్రమాల అమలు  సాధ్యమన్నారు కానీ ఇప్పుడు ఎక్కడుంటే అక్కడికే పింఛన్ అందిస్తున్నామని గుర్తుచేశారు. మరోవైపు వైసీపీపై స్పందిస్తూ.. బాబాయిని చంపారు, నాటి సీఎం చేతుల్లోనే కత్తులు పెట్టారన్నారు. నారాసుర రక్తచరిత్ర అంటూ సాక్షి పత్రిక బరితెగించిందని ఆరోపించారు. రౌడీ షీటర్, గంజాయి బ్యాచ్‌ కోసం తెనాలి వెళ్లి పరామర్శించారని జగన్ పై విమర్శలు గుప్పించారు. రైతుల పరామర్శకు 15 వేల మందిని వెంట బెట్టుకుని ఎందుకు వెళ్లాలని ప్రశ్నించారు. మీ ఇంట్లో ఆడవాళ్లు ఉన్నారు కదా.. అమరావతిపై ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ సాక్షి డిబేట్ లో ఘటనపై వ్యాఖ్యానించారు. టాపిక్ డైవర్షన్ కోసమే పొదిలిలో పొగాకు రైతుల పరామర్శ డ్రామా అని అన్నారు.

మరోవైపు కూటమి ఏడాది పాలనపై స్పందించిన మంత్రి నారా లోకేష్ ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్నక్యాంటీన్లు నడిపిస్తున్నామన్నారు. దీపం పథకం కింద గ్యాస్ సిలెండర్లు, ఆడపడుచులకు లోన్లు ఇస్తున్నామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నామని గుర్తుచేశారు. తల్లికి వందనం పథకం కింద ప్రతి తల్లి ఖాతాలో నగదును జమ చే శామనిమన్నారు. కూటమి ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులని మంత్రి నారా లోకేష్ అన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos