ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై, విజయవాడ జిల్లా జైలులో 220 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు... అమరావతి ప్రాంతంలో ఉన్న మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమంలో చికిత్స చేయించుకునేందుకు ఏసీబీ కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఆరోగ్య పరంగా మంతెన ఆశ్రమంలో ఆయుర్వేద చికిత్స అవసరమని పేర్కొంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఆయన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. కానీ అలుపెరుగని ప్రయత్నం చేసిన ఆయన ఈ సారి అనుమతి తెచ్చుకున్నారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జడ్జి... 15 రోజుల పాటు ఆశ్రమంలో చికిత్స పొందేందుకు అవకాశం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆశ్రమంలో వైద్య సేవలు పొందేందుకు కోర్టు అనుమతించింది. గతంలో వెన్నునొప్పి సమస్యతో మంతెన ఆశ్రమంలో చికిత్స తీసుకోవడంతో ఉపశమనం లభించిందని, ప్రస్తుతం కూడా అదే సమస్య తీవ్రంగా ఉందని కోర్టుకు తెలియజేయడంతో... మంతెన ఆశ్రమంలో చికిత్స పొందేందుకు కోర్టు అనుమతించింది.

చెవిరెడ్డి తన ఆరోగ్య సమస్యను చూపిస్తూ పదే పదే కోర్టును ఆశ్రయించడం వెనుక కేవలం అనారోగ్యమే కాకుండా, రాజకీయ వ్యూహం కూడా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జైలు వాతావరణం నుంచి బయటపడటానికి, బయట ఆశ్రమంలో ఉంటే తన వ్యవహారాలు చక్కబెట్టడానికి అవసరమైన పరిస్థితులు ఉంటాయన్న కారణంగానే ఆయన ఈ ప్రయత్నం చేసినట్లుగా భావిస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos