అమరావతి రాజధాని నిర్మాణాన్ని పరుగులు తీయిచాలని భావిస్తున్న కూటమి సర్కార్ ఆలోచనలకు అనుగుణంగా ఇవాళ సీఆర్డీయే అథారిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీయే 65వ అధారిటీ సమావేశంలో మున్సిపల్ మంత్రి నారాయణతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ భేటీలో మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే సమర్పించిన పలు ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేశారు. అమరావతి లో క్వాంటం వ్యాలీకి సంబంధించిన సామగ్రి కోసం ఒక ప్రత్యేక భవనాన్ని నిర్మించాలని అధారిటీ నిర్ణయం తీసుకుంది. సుమారు 43,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 103.96 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దీనికి టెండర్లు పిలిచి ఎల్1ని ఖరారు చేశారు. ఈ ప్రత్యేక భవనం రెండు ఎకరాల విస్తీర్ణంలో టెక్నికల్ నిపుణుల డిజైన్ ప్రకారం నిర్మించనున్నారు. దీంతోపాటు క్వాంటం వ్యాలీలో మరో రెండు భవనాల నిర్మాణాన్ని కూడా వెంటనే చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఐఏఎస్ ఆఫీసర్ల బంగ్లాలకు అంతర్గత మౌలిక సదుపాయాల కల్పనకు 109.52 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖకు ఆసుపత్రి, యూనివర్సిటీ కోసం 60 ఏళ్ల పాటు ఎకరం రూపాయి చొప్పున లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ప్రాంతంలో 750 కోట్లతో ఆయుష్ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేస్తారు. అమరావతిలో వరద నివారణకు కొండవీటి వాగు , పాలవాగు , గ్రావీటి కెనాల్ తో పాటు ఆరు రిజర్వాయర్ ల నిర్మాణానికి ఇప్పటికే ప్రతిపాదించారు. వీటితోపాటు కొత్తగా గుంటూరు ఛానల్ ద్వారా 4వేల క్యూసెక్కులు బయటికి పంపేలా పంపింగ్ స్టేషన్ నిర్మించాలని నిర్ణయించారు. ఇప్పడున్న పంపింగ్ సామర్ధ్యానికి అధనంగా మరో 8500 క్యూసెక్కుల సామర్ధ్యం గల పంపింగ్ స్టేషన్ ను రూ.443 కోట్లతో ఏర్పాటుకు అధారిటీ ఆమోదం తెలిపింది. ఎల్పీఎస్ జోన్ 8లో రూ.1351కోట్లతో పనులకు అథారిటీ ఆమోదం తెలిపింది. జరీబు,  నాన్ జరీబు భూముల సమస్య పరిష్కారానికి జిల్లా స్థాయి అధికారుల కమిటీ ఏర్పాటుకు కూడా ఆమోదం తెలిపారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos