ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతి రాజధాని పనుల్ని తిరిగి ప్రారంభించడంతో పాటు వేగంగా పూర్తి చేసేందుకు చేయని ప్రయత్నం లేదు. అమరావతిలో ఈసారి భూసమీకరణ విషయంలో ప్రభుత్వానికి కొన్ని చోట్ల చుక్కెదురవుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 52వ సీఆర్డీఏ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇవ్వని అతి కొద్దిమంది రైతుల భూములను భూసేకరణ ద్వారా తీసుకోవాలని నిర్ణయించారు. రైతులను ఇబ్బంది పెట్టకూడదనేది ప్రభుత్వ నిర్ణయమని మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఇప్పటికీ ల్యాండ్ పూలింగ్ కు రైతులు ముందుకొస్తే తీసుకుంటామన్నారు.
అలాగే దాదాపు 1800 ఎకరాలు భూసేకరణ ద్వారా తీసుకునేందుకు సీఆర్డీఏకు అనుమతి ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ కు రావాలని మరోసారి రైతుల్ని మంత్రి నారాయణ కోరారు. భూసేకరణ కంటే భూసమీకరణ అయితేనే రైతులకు లబ్ది కలుగుతుందన్నారు. భూములు ఇవ్వకపోవడంతో కీలక ప్రాజెక్టుల నిర్మాణానికి ఇబ్బందులు వస్తున్నాయన్నారు. మరోవైపు ఏజీసీలో మౌలిక వసతుల కల్పనకు టెండర్లు దక్కించుకున్న సంస్థకు లెటర్ ఆఫ్ అథారిటీ ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు.
సీఆర్డీయే ఆద్వర్యంలో ఉన్న ఏడీసీఎల్ తరహాలో కొత్తగా మరో ఎస్పీవీ ఏర్పాటుకు అధారిటీ ఆమోదం తెలిపింది. ఎయిర్ పోర్ట్,స్పోర్ట్స్ సిటీ,ఎన్టీఆర్ విగ్రహం వంటి కీలక ప్రాజెక్టుల నిర్మాణం కొరకు కొత్తగా ఎస్పీపీ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. అర్బన్ డిజైన్ అండ్ ఆర్కిటెక్చరల్ గైడెన్స్ కోసం నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. రెవెన్యూ,సర్వే సెటిల్మెంట్ శాఖల నుంచి 138 మంది ఉద్యోగులను డిప్యూటీషన్ పై తీసుకునేందుకు ఆమోదం తెలిపారని సమాచారం
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos