ఏపీలో రాజధాని అమరావతిపై నిర్మాణ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం ముందడుగు వేయబోతోంది. నిర్మాణాలకు శ్రీకారం చుట్టబోతోంది. అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా నిర్మాణాలు పునః ప్రారంభానికి నోచుకున్న నేపథ్యంలో.. ఈ పనుల్లో వేగం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఇవాళ సీఆర్డీఏ -  రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి భేటీ కాబోతోంది. ఇది 48వ సమావేశం. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించనున్నారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది. ఇందులో చర్చకు వచ్చిన అంశాలు, ప్రతిపాదనలను మంత్రివర్గంలో ఆమోదించవచ్చు.

కేపిటల్ రీజియన్ పరిధిలో ఇప్పటివరకు మంజూరు చేసిన నిధులు- భూముల కేటాయింపు, చేపట్టిన నిర్మాణ పనులను సమీక్షించడం, జంగిల్ క్లియరెన్స్, రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్డు, ఎక్స్ ప్రెస్ వే, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ ప్రతిపాదనలపై చర్చిస్తారు. కొత్తగా చేపట్టదలిచిన భూసేకరణ కూడా ఇందులో ప్రస్తావనకు రానుంది. సీఆర్డీఏ 47వ సమావేశంలో ఆమోదించిన ప్రతిపాదనలపైనా చర్చిస్తారు. ఇదివరకు సీఆర్డీఏ భేటీలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల నివాస భవనాల సముదాయాలు, వాటికి కల్పించాల్సిన మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం 1,732.31 కోట్ల రూపాయలకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

లా యూనివర్సిటీ, క్వాంటం వ్యాలీ నిర్మాణానికి కేటాయించిన భూముల స్థితిగతులు ఈ సందర్భంగా చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ రెండింటి కోసం ఇదివరకటి సీఆర్డీఏ సమావేశంలోనే ప్రభుత్వం భూములను కేటాయించింది. ఆదాయపు పన్ను విభాగం, రెడ్ క్రాస్ సొసైటీ, కోస్టల్ బ్యాంక్, ఐఆర్​సీటీసీకి భూములను కేటాయించింది అప్పట్లో. ఇవాళ జరగనున్న సీఆర్డీఏ సమావేశంలో ఆయా అంశాలపై చర్చించి ప్రభుత్వం తుది ఆమోదం తెలపనుంది. ఈ సమావేశంలో ఆమోదం పొందిన ప్రతిపాదనలపై మంత్రివర్గం సమావేశంలో చర్చించనుంది ప్రభుత్వం. అనంతరం- వీటన్నింటిపైనా మంత్రివర్గం పచ్చజెండా ఊపితే.. పనుల్లో వేగం పుంజుకుంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos