అమరావతి : గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతల దుర్మార్గాలు, దురాగతాలపై బాధితులు ఒకొక్కరు వరుసగా బయటకు వస్తున్నారు. వైసీపీ నేతల అరాచకాలతో తమకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపించి, తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విన్నవించుకుంటున్నారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ముఖ్యమంత్రికి... తమపై వైసీపీ మూకలు దుర్మార్గంగా ఎలా దాడులు చేసింది, ఆస్తులు ఎలా దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారనే దానిని బాధితులు వివరించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరగా, అన్యాయాలు, అక్రమాలపై విచారణకు హామీ ఇచ్చారు. అలాగే దివ్యాంగులు, వృద్ధుల నుంచి అర్జీలు తీసుకుని తక్షణ సాయంగా పలువురికి ముఖ్యమంత్రి ఆర్ధిక సాయం అందించారు.  

ఎమ్మెల్సీ తలశిల రఘరాంపై ఫిర్యాదు :

అధికారాన్ని అడ్డంపెట్టుకుని వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం తమ తండ్రిపై అక్రమ కేసులు పెట్టి వేధించారని, నాటి సీఐ రవీంద్ర, ఏసీపీ హనుమంతురావుతో బెదిరించి రూ.10 కోట్ల విలువైన తమ ఆస్తులు రాయించుకన్నారని గొల్లపూడికి చెందిన కారెంపూడి అభిరామ్ సీఎంకు ఫిర్యాదు చేశారు. ఎంపీటీసీ ఎన్నికల్లో తన తండ్రి రవీంద్ర నామినేషన్ వేశారన్న అక్కసుతో లక్ష్యంగా చేసుకుని వేధించి కేసులు పెట్టి 73 రోజులు జైల్లో పెట్టారని వాపోయారు. తమ దగ్గర అప్పు తీసుకున్న వారిని తిరిగి ఇవ్వనివ్వకుండా  అడ్డుకుని రూ.3.5 కోట్లు నష్టపోయేలా చేశారని, ఆర్థిక ఇబ్బందులతో తన తండ్రి గుండెపోటుతో మృతి చెందారని అభిరామ్ కన్నీటిపర్యంతమయ్యారు. తలశిల రఘురాంపై విచారణ చేయిస్తే ఇలాంటి దుర్మార్గాలు ఎన్నో బయటకు వస్తాయని చెప్పారు.  

శంకర్ నారాయణది అదే దారి :

వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న శంకర్ నారాయణ బెదిరించి మరీ తమ ఆస్తులను బలవంతంగా లాక్కున్నారని సత్యసాయిజిల్లా, పెనుకొండ మండలం, చంద్రగిరి గ్రామానికి చెందిన జి.మధు సీఎం వద్ద మొరపెట్టుకున్నారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా నాటి సీఐ శ్రీహరి, ఎస్ఐ భాషా తిరిగి తమనే బెదిరించారన్నారు. తనను, తన భార్యను నాలుగు రోజుల పాటు స్టేషన్లో ఉంచి తమ ఇంట్లోని రూ.38 లక్షల నగదు, ఇతర ఆస్తి పత్రాలు తీసుకెళ్లారని చెప్పుకున్నారు. తమకు చెందిన కొంత భూమిని ఎస్ఐ, సీఐ అమ్ముకున్నారని, తగిన న్యాయం చేయాలని కోరారు. చంపావతి నది నుంచి అక్రమంగా ఇసుక తరలింపును అడ్డుకున్నందుకు 2022లో  తనపై వైసీపీ నేత మైపాడు ప్రసాద్ దాడి చేశారని, తిరిగి తనపైనే కేసులు పెట్టారని నెల్లిమర్లకు చెందిన పి.సురేష్ చెప్పుకొచ్చారు.  

అన్న క్యాంటీన్‌కు రూ. లక్ష విరాళం :

అన్నక్యాంటీన్ కు గొల్లపూడికి చెందిన వృద్ధురాలు యలమంచిలి బేబీ సరోజిని రూ. 1 లక్షను విరాళంగా అందించారు. ఎప్పటి నుంచో పొదుపు చేస్తూ వచ్చిన సొమ్మును అన్నక్యాంటీన్‌కు విరాళంగా ఇచ్చానన్నారు. ఈ సందర్భంగా సరోజినీని సీఎం అభినందించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos