అమరావ‌తి:  ఉత్త‌రాంధ్ర‌పై తుఫాన్ ప్ర‌భావం నేప‌థ్యంలో స‌చివాల‌యంలోని రియ‌ల్ టైమ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) పూర్తి స్థాయిలో అప్ర‌మ‌త్త‌మైంది. ఆర్టీజీఎస్ క‌మాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి వాతావ‌ర‌ణ మార్పుల‌ను, జిల్లాల్లో క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితుల‌ను ఆర్టీజీఎస్ అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఆర్టీజీ శాఖ కార్య‌ద‌ర్శి భాస్క‌ర్ కాటంనేని, ఆర్టీజీఎస్ సీఈఓ ప్ర‌ఖ‌ర్ జైన్‌లు తుపాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌రిస్థితిని స‌మీక్షించారు. వాతావ‌ర‌ణంలో వ‌స్తున్న మార్పులు, తుపాన్ క‌ద‌లిక‌ల‌ను అవేర్ విభాగం ఎప్ప‌టిక‌ప్పుడు రియ‌ల్ టైమ్‌లో ట్రాక్ చేసి, ఆ స‌మాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌భావిత జిల్లాల‌కు చేర‌వేసేలా ఏర్పాట్లు చేశారు. ఏఏ ప్రాంతాల్లో తుపాను ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండ‌నుంది, రిజ్వ‌ర్వాయ‌ర్ల‌ ప‌రిస్థితి, వాటి క్యాచ్‌మెంటు ఏరియాల్లో ఎంత నీరు రావ‌చ్చు త‌దిత‌ర వివ‌రాలును జిల్లాల‌కు ఎప్ప‌టికప్పుడు చేర‌వేసి అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. తుఫాను క‌ళింగ‌ప‌ట్నం వ‌ద్ద తీరం దాటే సూచ‌న‌లుండ‌టంతో శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, పార్వ‌తీపురం మ‌న్యం, విశాఖ‌ప‌ట్నం,అల్లూరి సీతారామ‌రాజు, అన‌కాప‌ల్లి జిల్లాల యంత్రాంగాన్ని ప్ర‌త్యేకించి అప్ర‌మ‌త్తం చేశారు. శ్రీకాకుళంలో ఏఏ ప్రాంతంలో ఆక‌స్మిక వ‌ర‌ద‌లు వ‌చ్చే అవ‌కాశాలున్నాయో గుర్తించి ఆ జిల్లా యంత్రాంగాన్ని ముందుగానే అప్ర‌మ‌త్తం చేస్తున్నారు.  

అవేర్ ద్వారా అలెర్టుల జారీ..

అవేర్ విభాగం ద్వారా తుఫాను క‌ద‌లిక‌లు, దాని ప్ర‌భావం గురించి ప్ర‌జ‌ల‌కు వారి మొబైల్ ఫోన్ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం, హెచ్చ‌రిక సందేశాలు పంపుతున్నారు. దీంతోపాటు ఆయా శాఖ‌ల ఉన్న‌తాధికారులు, క్షేత్రస్థాయిలో వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌డుతున్న సిబ్బంది, స్వ‌ర్ణ వార్డు, స్వ‌ర్ణ‌గ్రామ స‌చివాల‌య అధికారుల వ‌ర‌కు కూడా ఎప్ప‌టిక్పుడు తుపాను ప‌రిస్థితులు,  వ‌ర్షాల‌కు సంబంధించిన స‌మాచారాన్ని వారి మొబైల్‌ఫోన్ల‌కు చేర‌వేస్తున్నారు. త‌ద్వారా ఆయా ప్రాంతాల్లో స‌హాయ‌క‌చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం సుల‌భ‌త‌ర‌మ‌య్యేలా చేస్తున్నారు.  ఆర్టీజీఎస్ డిప్యూటీ సీఈఓ డాక్ట‌ర్ ఎం మాధురి, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్లు పి. శ్రీఖ‌ర్‌, కె. చైతన్య, డి. అఖిల త‌దిత‌రులు ఆయా జిల్లాల్లో ప‌రిస్థితిని స‌మీక్షిస్తూ ఉన్న‌తాధికారుల‌కు నివేదిస్తున్నారు. 

రియ‌ల్ టైమ్‌లో వాతావ‌ర‌ణ విశేషాలు.. 

ప్ర‌జ‌లు కూడా ఆర్టీజీఎస్ వారి అవేర్ వెబ్‌సైట్‌, యాప్ ద్వారా తామున్న చోటు నుంచే త‌మ మొబైల్ ఫోను ద్వారా రియ‌ల్ టైములో వాతావ‌ర‌ణ విశేషాలు, తుపాను క‌ద‌లిక‌ల‌ను తెలుసుకోవచ్చ‌ని ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు. తుపాను ప్ర‌భావం, వ‌ర్షాల తీవ్ర‌తతో పాటు త‌మ ప్రాంతానికి సంబంధించిన వాతావ‌ర‌ణ మార్పుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తామున్న చోటు నుంచే తెలుసుకోవచ్చు. దీనికోసం https://aware.ap.gov.in/dashboard వెబ్సైటును  సంద‌ర్శించాలి లేదా అవేర్ యాప్‌ను డౌన్లోడు చేసుకోవ‌డం ద్వారా తెలుసుకోవ‌చ్చు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos