బంగాళాఖాతంలో గత నెల ఏర్పడిన దానా తుఫాన్ ప్రభావంతో ... అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. వరదలు సంభవించాయి. ఇప్పుడు మళ్లీ అవే తరహా పరిస్థితులు తలెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. హిందూ మహా సముద్రంలో తాజాగా తుఫాన్ ఏర్పడటమే దీనికి కారణం. ఇక్కడ ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా బలపడింది. ఫలితంగా తమిళనాడు తీర ప్రాంత జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.

ఈ అల్పపీడనం వచ్చే 24 గంటల్లో మరింత బలపడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదికాస్త  వాయుగుండంగా, ఈ నెల 24వ తేదీ నాటికి తుఫాన్‌గా మారుతుందని పేర్కొంది. దీనికి ఫెంగల్ అని పేరు పెట్టింది. ఈ పేరును- సౌదీ అరేబియా సూచించింది.

ఈ సీజన్‌లో సంభవించబోతోన్న మూడో తుఫాన్ ఇది. ప్రస్తుతం ఈ అల్పపీడనం ఇండోనేసియాలోని సుమత్ర- అండమాన్ నికోబార్‌ ద్వీప సమీపంలో కేంద్రీకృతమైంది. క్రమంగా ఇది పశ్చిమ- వాయవ్యం, వాయవ్యం దిశగా కదులుతుందని, వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో నవంబర్ 23వ తేదీ నాటికి బంగాళాఖాతం ఆగ్నేయ ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ అల్పపీడనం క్రమంగా ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి, రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై వాయుగుండంగా మారుతుందని పేర్కొంది.

దీని ప్రభావంతో ఈ నెల 26, 27 తేదీల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం వెల్లడించింది. కాకినాడ, కృష్ణా, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, బాపట్లతో పాటు రాయలసీమలోని చిత్తూరు, తిరుపతి, శ్రీసత్యసాయి పుట్టపర్తి, దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos