ఏపీ రాష్ట్రం వైపు మరో తుపాను దూసుకొస్తోంది. దిత్వా తుఫాను ముప్పు రాష్ట్రానికి పొంచి ఉంది. దీనివల్ల కోస్తా, రాయలసీమల్లో తీవ్ర ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పలు జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా, ఆ తర్వాత కొద్దిగంటల్లోనే తీవ్ర వాయుగుండంగా అనంతరం తుఫాన్‌గా మారింది. ఇది 30వ తేదీ ఉదయం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య తీరం దాటనుంది. పలు జిల్లాలకు దీని ప్రభావంపై వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది.

దిత్వా తుఫాను గంటకు 10 నుంచి 15 కి.మీ. వేగంతో ఉత్తర వాయవ్యంగా పయనిస్తోంది. ఈ నెల 30వ తేదీ ఉదయానికి తమిళనాడు, కోస్తాంధ్ర తీరాల వైపు రానుందని ఐఎండీ తెలిపింది. పలు వాతావరణ మోడళ్ల మేరకు 30 వ తేదీ ఉదయం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య తీరం దాటనుంది. దీని ప్రభావం కోస్తాలో కోనసీమ జిల్లా నుంచి నెల్లూరు వరకూ, రాయలసీమలో కొన్ని జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. శుక్రవారం దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ వర్షాలు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయి. శనివారం రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల వర్షాలు.. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో అతిభారీ, ప్రకాశం, బాపట్ల, కడప, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

కాగా, తుఫాన్‌ తీరం దాటే సమయంలో ఆదివారం రాష్ట్రంలో అనేకచోట్ల వర్షాలు కురుస్తాయి. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల్లో కొన్నిచోట్ల కుంభవృష్టిగా, బాపట్ల, పల్నాడు, గుంటూరు, నంద్యాల జిల్లాల్లో అతిభారీగా, కృష్ణా, ఎన్టీఆర్‌, పశ్చిమగోదావరి, కర్నూలు, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల సాధారణ వర్షాలు కురుస్తాయి. ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అతి భారీ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, పల్నాడు, కడప, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కోస్తాలోని అన్ని ఓడరేవుల్లో ఒకటో నంబరు ప్రమాద సూచిక ఎగురవేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.  శనివారం నుంచి తీరం వెంబడి గంటకు 60 నుంచి 70, అపుడప్పుడు 80 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos