సంక్రాంతికి ముందు ఏపీ తీర ప్రాంతంలో తుపాను ముప్పు ఉందని IMD వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడుతూ తుపానుగా మారే ఛాన్స్ ఉందని తెలిపింది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా తీవ్రంగా బలపడుతోంది. ఇది తుపానుగా మారి తీర ప్రాంతాలపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. గాలుల వేగం గంటకు 60–100 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. తుపాను కారణంగా ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలు ఒడిశా తీర ప్రాంతాలు, తమిళనాడు తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
శ్రీలంక, తమిళనాడులో శుక్ర, శని, ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. వాయుగుండం ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, నంద్యాలలో ఉరుములతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. వాయుగుండం నేపథ్యంలో విశాఖ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు ఒకటో నంబరు హెచ్చరికలు జారీ చేసింది. సంక్రాంతికి ముందు తుపాను ముప్పు ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos