వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సోదరుడు వైఎస్ అభిషేక్ రెడ్డి మృతి చెందారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అభిషేక్ రెడ్డి మంగళవారం రాత్రి హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. అభిషేక్‌రెడ్డి విశాఖపట్నంలో వైద్యవృత్తిలో స్థిరపడ్డారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి అన్న వైఎస్ ప్రకాశ్ రెడ్డి మనవడే వైఎస్అభిషేక్రెడ్డి. గత ఎన్నికల్లో అభిషేక్ రెడ్డి కీలక పాత్ర పోషించారు.లింగాల మండలానికి అభిషేక్ రెడ్డి ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అభిషేక్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది.
కాగా, అభిషేక్ రెడ్డి చనిపోయారని తెలియగానే.. వైసీపీ నేతలు ఏదో ఊహించుకుని టీడీపీపై దుష్ప్రచారం మొదలుపెట్టారు. టీడీపీ నేతలు... శవ రాజకీయం చేస్తున్నారని వైసీపీ నేతలు ఎదురుదాడి ప్రారంభించారు. అసలు వైఎస్ అభిషేక్ రెడ్డి చనిపోవడంపై టీడీపీ నుంచి ఎవరూ స్పందించలేదు. అయినా వైసీపీ నేతలు ఏదేదో ఊహించుకుని... అభిషేక్ రెడ్డి మృతిపై టీడీపీ శవ రాజకీయం చేస్తోందని లేనిపోని విమర్శలు చేస్తూ దుష్ప్ర చారానికి తెగబడుతున్నారు.
కాగా.. అసలు విషయం ఏమిటంటే అభిషేక్ రెడ్డి ఆస్పత్రిలో చావు బతుకుల్లో ఉన్నా .. జగన్ ఒక్కసారి కూడా పరామర్శించలేదన్నది నిజం. జగన్ దంపతులు తమ సొంత బంధువు అభిషేక్ రెడ్డి చికిత్స పొందుతున్నప్పుడు పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్లలేదు. అభిషేక్ రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన బంధువులను పరామర్శించడానికి ఎందుకు వెళ్లలేదన్నది చాలా మందికి ఉన్న డౌట్. ఇదే డౌట్ వ్యక్తం చేస్తే..వైసీపీ కార్యకర్తలు విరుచుకుపడుతున్నారు. చావును రాజకీయం చేస్తున్నారని అంటున్నారు. మొత్తానికి వైసీపీ వాళ్లే ఈ చావుపై అతిగా స్పందించి రాజకీయం చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos