ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ రోజు కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. హోంమంత్రి అమిత్ షాతో ఆయన మీటింగ్ షెడ్యూల్ ఖరారు అయింది. ఇంత హఠాత్తుగా పవన్‌కు ఢిల్లీ నుంచి పిలుపురావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

హోంమంత్రిత్వ శాఖ, హోంమంత్రి అనితపై పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. వైసీపీకి ఓ అస్త్రం ఇచ్చినట్లయిందన్న వాదన వినిపిస్తోంది. అదే సమయంలో కూటమి మధ్య విబేధాలు వచ్చాయంటూ జాతీయ మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. ఓ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉంటూ పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అసాధారణమని .. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత పార్టీల మధ్య గ్యాప్ లేదని అనుకోలేమని జాతీయ స్థాయిలో రాజకీయ చర్చలు జరిగాయి. ఇవన్నీ అమిత్ షా దృష్టిలో పడ్డాయేమో కానీ పవన్ ను హఠాత్తుగా ఢిల్లీకి పిలిపించినట్లుగా తెలుస్తోంది.

పవన్ కల్యాణ్ అలా మాట్లాడటానికి కారణం ఏమిటి.. కూటమి పాలనలో ఏం జరుగుతోందని పవన్ భావిస్తున్నారు లాంటి అంశాలపై అమిత్ షా అభిప్రాయాలు తెలుసుకుంటారని అంటున్నారు. ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉంటూ పోలీసుల పనితీరుపై ర్యాండమ్ గా అలాంటి ఆరోపణలు చేస్తే వారి స్థైర్యాన్ని దెబ్బతీసినట్లు అవుతుందని ఏదైనా స్పెసిఫిక్ గా ఓ కేసు గురించి చెప్పడం వేరు.. పోలీసులు ఇంకా వైసీపీ మాయలోనే ఉన్నారని ఆరోపించడం వేరని భావిస్తున్నారు.

కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షాకు ఎప్పటికప్పుడు రాష్ట్రాలపై నివేదికలు వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ను పిలిచి మాట్లాడాలని భావించారని... అందుకే ఆయనకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందని భావిస్తున్నారు. వ్యాఖ్యల వల్ల రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగిందని భావించినందువల్లనే తాజా పరిణామం చోటుచేసుకుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos