విజయవాడ వరద బాధితులకు ప్రభుత్వం ఇప్పటికే పరిహారం విడుదల చేసింది. అయితే పరిహారం అందని వారు కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. దీంతో, పరిహారం అందని వారిని గుర్తించిన ప్రభుత్వం... ఈ రోజు వారి ఖాతాల్లోకి పరిహార సొమ్ము జమ చేసింది. గతంలో పరిహారం పొందిన వారు కాకుండా ఇప్పుడు మరో 1501 మందికి రూ.2.5 కోట్ల పరిహారం విడుదలైంది. 1501 మంది బాధితులకు వారి అకౌంట్లకు ఈరోజు నగదును సర్కార్ బదిలీ చేసింది.

ఇందులో బ్యాంక్ అకౌంట్ ఇనాక్టివ్‌గా ఉన్న కారణంతో 143 మందికి లబ్ధిదారుల అకౌంట్లలో పరిహారం జమ అవ్వలేదని అధికారులు గుర్తించారు. వీరికి సంబంధించి మరోసారి బ్యాంకు వివరాలు తీసుకుని నేరుగా నగదు పరిహారం అందించాలని నిర్ణయించారు. బ్యాంకు ఖాతాలు లేవని గుర్తించిన 256 మంది వివరాలను సచివాలయాలు, ప్రభుత్వ వెబ్‌సైట్ ద్వారా అధికారులు అధికారులు వెల్లడించనున్నారు.

బ్యాంక్ అకౌంట్ వివరాలు అందించి ఈ 256 మంది తమకు వచ్చే పరిహారం పొందవచ్చని అధికారులు తెలిపారు. విజయవాడలోని 179 సచివాలయాల పరిధిలోని ప్రజలకు వరద సహాయాన్ని సెప్టెంబర్ లోనే వారి ఖాతాల్లో డబ్బులు వేశారు. ఇళ్లు, దుకాణాలు, తోపుడు బళ్లు, వ్యాపారాలు, చిన్న తరహా పరిశ్రమలు, వాహనాలు, పంటలు, పశువులు నష్టపోయిన వారికి ఆర్థిక సాయం అందించింది. వరదలు వచ్చిన 15 రోజుల్లోనే బాధితులకు వారి ఖాతాల్లో ప్రభుత్వం వరద సహాయాన్ని జమ చేసింది.

తొలి విడత పరిహారంగా మొత్తం రూ.618 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. విడతల వారీగా ప్రభుత్వం లబ్దిదారుల ఖాతాల్లో డబ్బును జమచేస్తోంది. ముందుగా రూ.602 కోట్లను జమ చేసిన సర్కార్.. ఆ తరువాత రూ.9 కోట్లు.. ఆపై రూ. 16 కోట్లను లబ్దిదారుల ఖాతాల్లో జమచేసింది. మొత్తం 4,19,528 మందికి ప్రభుత్వం పరిహారం అందజేసింది. అలాగే తాజాగా 2954 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 1646 మందిని అర్హులుగా గుర్తించారు. వారిలో ప్రస్తుతం 1501 మంది బాధితులకు రూ.2.5 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం అందజేసింది. ఇంకా అందాల్సిన వారికి మరో వారం రోజుల్లో పూర్తి స్థాయిలో పరిహారం అందేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos