ఏపీ: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు గాలిస్తున్న సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనే ఆరోపణలపై రామ్‌గోపాల్ వర్మ మీద ఏపీలో కేసులు నమోదయ్యాయి. దీనిపై ఒంగోలు పోలీసులు ఆర్జీవీకి నోటీసులు కూడా ఇచ్చారు. అయితే విచారణకు హాజరుకాకపోవటంతో రామ్‌ గోపాల్ వర్మ కోసం ప్రకాశం జిల్లా పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ ఉదయం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ రామ్‌గోపాల్ వర్మ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

రామ్‌గోపాల్ వర్మ కనిపించకుండా పోవటం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్ కాగా.. ఆర్జీవీ వ్యవహారంపై మీడియా ప్రతినిధులు పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించారు. ఈ క్రమంలో రామ్‌గోపాల్ వర్మతో పాటుగా పలువురు నోటీసులు అందుకుని కూడా విచారణకు రాలేదని.. అయితే దీనిపై తాను ఇప్పుడేమీ స్పందించనంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ విషయంలో పోలీసులను వారి పని వారిని చేసుకోనివ్వాలని అన్నారు.

హోం శాఖ, శాంతిభద్రతలు తన పరిధిలో లేవన్న పవన్ కళ్యాణ్.. తనకు అప్పగించిన శాఖలపై మాట్లాడాలంటే మాట్లాడతానని చెప్పారు. ఏవైనా ఉంటే అడగాల్సింది సీఎం చంద్రబాబు నాయుడునని చెప్పారు. శాంతిభద్రతల అంశం హోంమంత్రి పరిధిలోదని.. హోం మంత్రి చూస్తారని, తాను కాదని నవ్వుతూ బదులిచ్చారు. ఇక చంద్రబాబును ఇబ్బంది పెట్టిన సమయంలో ధైర్యంగా వ్యవహరించిన ఏపీ పోలీసులు.. ఇప్పుడెందుకు తటపటాయిస్తున్నారనేదీ ముఖ్యమంత్రిని అడుగుతానని.. అలాగే ఢిల్లీలో మీడియా అడిగిన ప్రశ్నలను ఆయన వద్ద ప్రస్తావిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. మరోవైపు విచారణకు రావాలంటూ ఒంగోలు పోలీసులు రామ్‌గోపాల్ వర్మకు రెండుసార్లు నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ విచారణకు హాజరుకాకపోవటంతో.. ఇటీవల హైదరాబాద్‌లోని ఆర్జీవీ నివాసం వద్దకు వెళ్లారు. అయితే రామ్‌గోపాల్ వర్మ ఇంట్లో లేకపోవటం, ఫోన్ స్విఛాఫ్ రావటంతో ఆయన కోసం రెండు రాష్ట్రాల్లో గాలిస్తున్నారు. ఓ టీమ్ కోయంబత్తూరు కూడా వెళ్లి ఆర్జీవీ కోసం గాలిస్తున్నట్లు తెలిసింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos