జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిపాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. గతంలో ప్రజా ప్రతినిధిగా కూడా చేయని ఆయన నేరుగా డిప్యూటీ సీఎం అయ్యారు. ఏరి కోరి పంచాయతీరాజ్ శాఖలు తీసుకున్నారు. ఆయన అలా తీసుకోవడం వెనుక  ప్రతి పల్లెలో తనదైన ముద్ర వేయాలన్న సంకల్పం ఉందని తాజాగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో స్పష్టమవుతోంది. గ్రామ సీమల్లో గత ఐదేళ్ల పాటు జరగని పనుల్ని ఇప్పుడు ప్రారంభించబోతున్నారు. ఇందుకోసం పల్లె  పండుగ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఖరారు చేశారు. పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే  రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయితీల్లో ఒకేరోజు గ్రామసభలు నిర్వహింప చేశారు.  అందుకు వరల్డ్‌ రికార్డ్‌ యూనియన్‌ అవార్డు కూడా లభించింది. ఆ గ్రామ సభలను రికార్డు కోసం నిర్వహించలేదు. గ్రామాల్లో ఉన్న సమస్యలను నమోదు చేసుకున్నారు. ప్రాధాన్యత క్రమంలో ఏ ఏ పనుల్ని చేయాలో కూడా ఆయా పంచాయతీలే ప్రజల అభిప్రాయాల మేరకు నమోదు చేసుకున్నారు. ఇప్పుడు ఆయా పనుల్ని చేయించడానికి పవన్ కల్యాణ్ ఏర్పాట్లు చేశారు. పూర్తి స్థాయిలో నిధుల లభ్యత ఉండేలా చూస్తూ అభినృద్ధి పనుల్ని ప్రారంభించేందుకు పల్లె పండుగ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఖరారు చేశారు.

పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు మంజురైన పనులకు పండుగ వాతావరణంలో భూమిపూజను పల్లె పండుగలో చేయనున్నారు. అక్టోబర్‌ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ‘పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు’ జరుగుతాయి. రాజకీయంగా సనాతన ధర్మ పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టి హిందూ సమాజంలో ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్న పవన్ కల్యాణ్ మరో వైపు తన బాధ్యతల విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయడం లేదు. సమర్థవంతమైన అధికారుల టీమ్ ను ఏర్పాటు చేసుకున్న ఆయన తన ఆలోచన మేరకు పనులు శరవేగంగా జరిగేలా చూసుకుంటున్నారు. ప్రతి గ్రామంలోనూ పవన్ కల్యాణ్ పనులు చేయించారు అనే ముద్ర ఉండేలా చూసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అడ్మినిస్ట్రేటర్ కూడా ఆయన మంచి గుర్తింపు సాధించడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos