అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని సంబేపల్లి మండలం యర్రగుంట్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హంద్రీనీవా కెనాల్‌ (హెచ్‌ఎన్‌ఎస్‌) పీలేరు యూనిట్‌-2 స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న 50 ఏళ్ల రమాదేవి మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన వెంటనే క్షతగాత్రులను రాయచోటి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో బాధితులను అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. మృతి చెందిన డిప్యూటీ కలెక్టర్‌ రమాదేవి అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌లో గ్రీవెన్స్‌ సెల్ కోఆర్డినేటర్‌గా పని చేస్తున్నారు. రమాదేవి స్వస్థలం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం. పీలేరు నుంచి రాయచోటిలోని కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌ కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుగాలి రమ మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు.  రమ మృతి దురదృష్టకరమని అన్నారు. కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపి, ధైర్యంగా ఉండాలన్నారు. ప్రమాదంలో గాయపడిన మరో నలుగురికి అత్యవసర వైద్య చికిత్సలు అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. మరోవైపు మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ .. ఈ సమాచారం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొన్నారు. దివంగత అధికారి ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ, కన్నీటి నివాళి అర్పిస్తున్నాను.. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని సంబంధిత యంత్రాంగాన్ని కోరుతున్నాను.. వారంతా కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నాను అని పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్.

మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందిస్తూ.. అన్నమయ్య జిల్లా యర్రగుంట్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు.. గ్రీవెన్స్ కు వెళ్తూ ప్రమాదంలో హంద్రీనీవా డిప్యూటీ కలెక్టర్‌ రమ మృతి చెందటం బాధాకరమని అన్నారు.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యులు సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు.. ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్ శ్రీధర్ తో ఫోన్ లో మాట్లాడి ఆరా తీసి.. డిప్యూటీ కలెక్టర్‌ రమ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి. కాగా, రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమా మృతదేహానికి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ … రోడ్డు ప్రమాదం పై ఆరా తీశారు. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos