అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. రాజధానిలో అరుదైన నిర్మాణాల ప్రతి పాదనలకు ఆమోదం లభించింది. తెలుగు వైభవాన్ని చాటేలా అమరావతి అభివృద్ధి దిశగా తాజా గా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. క్రీడలు, పర్యాటకానికి పెద్ద పీట వేసేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. పెట్టుబడులు పెట్టడానికి వచ్చే సంస్థలతో నిరంతరం సంప్రదింపులు చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో రాజధానికి పెట్టుబడుల విషయంలో ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్లాలని అధికారులకు సీఎం చంద్రబాబు నిర్దేశించారు.

రాజధానిలో సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులను చేపట్టేలా అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. 59వ సీఆర్డీఏ అథార్టీ సమావేశంలో రాజధానిలోని వివిధ సంస్థలకు జరపాల్సిన భూ కేటాయింపులు, సెక్రటేరియేట్, హెచ్వోడీ భవనాల్లో కల్పించాల్సిన మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. సీఆర్డీఏ నుంచి వచ్చిన వివిధ ప్రతిపాదనలను సీఆర్డీఏ అథార్టీ సమావేశం ఆమోదించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ...'రాజధాని పరిధిలోని నీరుకొండ వద్ద చేపట్టే టూరిజం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టాలి. మొత్తంగా 167 ఎకరాల విస్తీర్ణంలో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టాలి. పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రణాళికలు సిద్దం చేయడంతో పాటు తెలుగు వైభవాన్ని చాటేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఈ ప్రాజెక్టులో వాటర్ ఫ్రంట్, కల్చరల్ సెంటర్ తదితర విభాగాలు వస్తాయని వివరించారు.

కాగా, పర్యాటకంతో పాటు నిత్యం రకరకాల కార్యక్రమాలు నిర్వహించుకునే వాతావరణం ఉండేలా చూడాలని... హోటళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అమ్యూజ్మెంట్ పార్కులను అభివృద్ధి చేయాలన్నారు. అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేలా ఆ ప్రాంతాన్ని డిజైన్ చేయాలని అధికారులకు నిర్దేశించారు. నీరుకొండలో చేపట్టే బోయే ప్రాజెక్టును అత్యంత సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్దాలన్నారు. భవిష్యత్తులో క్రీడా రంగం అతి పెద్ద ఆదాయ వనరు కాబోతోందని... దీనికి బీసీసీఐ, ఐసీసీ సంస్థలే అతి పెద్ద ఉదాహరణగా పేర్కొన్నారు.

అమరావతిలోని స్పోర్ట్స్ సిటీకి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఇదే విధంగా రూపొందించామని సీఎం చంద్రబాబు చెప్పారు. అమరావతిలోకి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులను తీసుకురావాలని స్పష్టం చేసారు. రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని... ఇలాంటి వారితో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉండాలని నిర్దేశించారు. బ్రాండ్ మరింతగా పెరగాలని... అందుకే పెట్టుబడులు పెట్టే వారిని రెగ్యులరుగా ఫాలో అప్ చేస్తూనే ఉండాలని సూచించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos