విశాఖపట్నంలో శుక్రవారం డీప్‌టెక్‌ ఇన్నోవేషన్‌ కాంక్లేవ్‌ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఏపీ నాలెడ్జ్‌ హబ్‌గా  అభివృద్ధి చెందుతోందని, ఐటీ, నాలెడ్జ్‌ ఎకానమీలో యువత సమర్థులుగా మారుతున్నారని అన్నారు. విదేశాల్లోని మన దేశ ఐటీ నిపుణుల్లో 30 శాతం తెలుగువారేనని తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ... ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడైనా సాంకేతికతపైనే చర్చ జరుగుతోందని,  దీనివల్ల అనేక నూతన మార్పులు వస్తున్నాయని, జీవితంలో టెక్నాలజీ ఓ భాగంగా మారిందని అన్నారు. భారత్‌లో ఆధార్‌ సాంకేతికత అనుసంధానంతో అన్ని వివరాలు తెలుస్తున్నాయని ఆన్నారు.

డీప్‌ టెక్నాలజీతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయయని, పర్యాటక రంగంలోనూ కొత్త విధానాలు తీసుకొచ్చేలా ఆలోచనలు చేస్తున్నామని,  ప్రస్తుత ప్రపంచంలో అన్ని అవసరాలకు కీలకంగా మారిన డ్రోన్ల అభివృద్ధి అంశంలోను లోతుగా ఆలోచిస్తున్నామని అన్నారు. నదుల అనుసంధానంతో నీటి కొరత ఉండదని.. ఆహార ఉత్పత్తులు, సరఫరాలో గ్లోబల్‌ హబ్‌గా ఏపీ మారబోతోందని చంద్రబాబు అన్నారు. అరకు కాఫీకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉండటం మన రాష్ట్రానికి గర్వించదగ్గ విషయమని అన్నారు. అధిక తీరప్రాంతం ఉండటం మనకు కలిసి వచ్చే అంశమని, మన రాష్ట్రానికి పెట్టుబడులతో వస్తున్న వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని చంద్రబాబు అన్నారు.

తాను 1995లో తొలిసారి సీఎం అయ్యాక హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధికి కృషి చేశానని, పీపీపీ పద్ధతిలో హైటెక్‌ సిటీని నిర్మించామని చంద్రబాబు అన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పనులు జరిగేవని, కొత్తగా పీ4 విధానం తీసుకొస్తున్నామని, ఇక నుంచి ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్య విధానంతో ముందుకెళ్తామని చంద్రబాబు పేర్కొన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos