వైసీపీకి త్వరలో మరో షాక్ తగలనుందని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి సీఎం జగన్ కు అత్యంత విధేయుల్లో ఒకరిగా మెలిగిన జోగి రమేష్ ... ఇప్పుడు ఒక్క చూపులు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా నూజివీడులో జరిగిన సంఘటన ఈ అనుమానాలను బలపరుస్తోందని అంటున్నారు. వైసీపీ లో కీలకనేతగా మెలిగిన మాజీ మంత్రి జోగి రమేష్ కూటమి నేతలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. మంత్రి పార్థసారథితో కలిసి ఊరు మొత్తం ర్యాలీగా తిరిగారు. గౌత లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం సందర్భంగా టీడీపీ నేతలతోపాటు జోగి రమేష్ హాజరు కావడంపై ఒక్కసారిగా రాజకీయాల్లో చర్చ మొదలైంది.
ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కూటమి వైపు అడుగులు వేశారు. వారిలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారు రోశయ్య, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, ఆళ్ళ నాని, గ్రంధి శ్రీనివాస్,రాపాక వర ప్రసాద్, వాసిరెడ్డి పద్మ లాంటి ప్రముఖులు ఉన్నారు. ఇక పార్థసారథి, లావు శ్రీకృష్ణదేవరాయలు, వసంత కృష్ణ ప్రసాద్ లాంటి వారు ఎన్నికలకు ముందే జగన్‌కు టాటా చెప్పేసి కూటమి వైపు వచ్చేశారు. ఇప్పుడు తాజా పరిణామాల నేపథ్యంలో జోగి రమేష్ కూటమినేతలతో కలిసి కనపడేసరికి ఏపీ పాలిటిక్స్‌లో కొత్త చర్చ మొదలైంది.
అయితే యోగి రమేష్ వర్గీయుల వాదన మరో రకంగా ఉంది. రాజకీయంగా చర్చ ఎలా ఉన్నా తాజాగా వైసీపీ నేత జోగి రమేష్ నూజివీడులో జరిగిన ర్యాలీలో పాల్గొన్నది కేవలం ఒక ప్రైవేట్ కార్యక్రమం గానే చూడాలని జోగి రమేష్ వర్గీయులు చెబుతున్నారు. ఇందులో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కోసమే కూటమి నేతలు పార్థసారథి, కొనికళ్ళ నారాయణ లాంటి వారితో కలిసి పాల్గొన్నారని చెబుతున్నారు. ఈ పరిణామంపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఈ అంశాన్ని ఎలా తీసుకుంటారో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos