మాజీ ముఖ్యమంత్రి జగన్ హెలికాప్టర్ డ్యామేజ్ అయింది. రాప్తాడు పర్యటనలో భాగంగా జగన్ ప్రత్యేక హెలికాప్టర్ లో అక్కడకు చేరుకున్నారు. తిరిగి అదే హెలికాప్టర్ లో జగన్ బెంగళూరు వెళ్లాల్సి ఉంది.  అయితే, భారీగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలి రావడంతో హెలికాప్టర్ అద్దాలు దెబ్బతిన్నాయి. వైసీపీ అధినేత జగన్ రాప్తాడు పర్యటనలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. జగన్ ప్రత్యేక హెలికాప్టర్ లో రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చేరకున్నారు. జగన్ అక్కడికి చేరుకునే సమయానికి పెద్ద సంఖ్యలో పార్టీ కేడర్.. అభిమానులు తరలి వచ్చారు. పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. ఆ తరువాత కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి చోటు చేసుకుంటున్న వరుస ఘటనల పైన మండిపడ్డారు. వైసీపీ నేతలను ఉద్దేశ పూర్వకంగా అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. అదే సమయంలో చంద్రబాబుకు గులాంగిరీ చేస్తున్న పోలీసులను తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగంలో నుంచి తొలగిస్తామని జగన్ హెచ్చరించారు. ప్రస్తుతం చట్టానికి అతీతంగా వ్యవహరిస్తున్న వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని జగన్ హెచ్చరించారు.

ఇదిలా ఉండగా జగన్ పరామర్శ పూర్తి చేసుకొని తిరిగి హెలిపాడ్ కు వెళ్లే సమయంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హెలికాప్టర్ వద్దకు చేరుకున్నారు. అక్కడ జరిగిన తొక్కిసలాటలో  హెలికాప్టర్ అద్దాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. దీని ఫలితంగా  హెలికాప్టర్ ను ప్రయాణానికి ఉపయోగించలేమని పైలట్లు స్పష్టం చేయడంతో.. జగన్ రోడ్డు మార్గంలో బెంగళూరు వెళ్లారు. కాగా, జగన్ పర్యటన సమయంలో భద్రతా లోపం కారణంగానే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో గుంటూరు పర్యటన సమయంలోనూ ఇదే విధంగా భద్రతలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని వారు గుర్తు చేస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos