సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పు తర్వాత ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. దీనిపై ఇవాళ ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం చర్చించింది. ఇందులో దళిత వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఎస్సీ వర్గీకరణకు తమ మద్దతు ప్రకటించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేసేందుకు తాము నియమించిన ఏకసభ్య కమిషన్ రిపోర్టు ఇచ్చిందని   తెలిపారు. అయితే అందులో కమిషన్ ఛైర్మన్ జనాభా గణన పూర్తి కానందున తాను ఎలాంటి సూచనలు చేయడం లేదని చెప్పారన్నారు. అయితే 2026లో జరిగే జనాభా లెక్కల తర్వాత జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ చేసేలా సిఫార్సు చేసినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. దీని ప్రకారం తాము కూడా జిల్లాల వారీగా విభజనకు మొగ్గు చూపుతున్నట్లు తెలిపారు.

ఎస్సీ వర్గీకరణ సమస్య ఎప్పటి నుంచో ఉందని, గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే తాము కేంద్రానికి ఈ మేరకు ప్రతిపాదన చేసి పంపామని చంద్రబాబు గుర్తుచేశారు. గతంలో మందకృష్ణ మాదిగ చేసిన పోరాటాన్ని గుర్తించి తాము దీనికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే గత ఎన్నికల్లోనూ జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా తాము నిర్ణయం తీసుకుని వెళ్లామన్నారు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ ద్వారా ఏయే కులాలకు ఎంత మేర రిజర్వేషన్లు వస్తాయో చంద్రబాబు అసెంబ్లీలో వివరించారు. అనంతరం అసెంబ్లీ ఏకసభ్య కమిషన్ రిపోర్టును ఆమోదిస్తూ తీర్మానం చేసింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos