ఏపీలో సిజేరియన్‌ ఆపరేషన్లు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని.. వాటిలో 90 శాతం ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇలాంటి ధోరణిని ఏమాత్రం ఆమోదించదని హెచ్చరించారు. సహజ ప్రసవాన్ని ప్రోత్సహించే దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖపై ఆదేశాలు జారీ చేశారు. భగవంతుడు ఇచ్చిన సహజసిద్ధమైన శరీరాన్ని కోయడం మంచిది కాదని సీఎం వ్యాఖ్యానించారు. ప్రసవం సహజంగా జరగడం తల్లీ బిడ్డల ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆయన వివరించారు. అవసరం లేని పరిస్థితుల్లో సిజేరియన్‌లు చేయకుండా నియంత్రించాలని ప్రభుత్వం దృఢంగా నిర్ణయించుకుందని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులు వాణిజ్య ప్రయోజనాల కోసం గర్భిణులను సిజేరియన్‌ వైపు మళ్లిస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయని సీఎం మండిపడ్డారు. ఇలాగే కొనసాగితే ఆ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, అవసరమైతే లైసెన్స్ రద్దు చేసే స్థాయిలో కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌కి సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గర్భిణులకు సురక్షిత ప్రసవంపై అవగాహన కల్పించాలని.. ప్రసవానికి ముందే యోగా శిక్షణ అందించేలా చూడాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా సహజ ప్రసవాల ప్రోత్సాహం కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని.. ఆస్పత్రుల్లో జరిగే సిజేరియన్ శాతంపై ప్రతి నెలా సమీక్ష జరిపి ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఆదేశించారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలనేది మన అందరి ఆకాంక్ష అని సీఎం అన్నారు. గర్భిణులకు సురక్షిత ప్రసవం హక్కు అని, వైద్యులు, ఆసుపత్రులు లాభాల కోసం కాకుండా బాధ్యతతో వ్యవహరించాలని ఆయన సూచించారు. సహజ ప్రసవాలు ప్రోత్సాహం పొందేలా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం ఖాయమని వివరించారు. మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా క్రమంగా తగ్గుతోందని.. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని వెల్లడించారు. యూపీ, బిహార్‌ వల్లే భారత్‌లో జనాభా బ్యాలెన్స్ అవుతోందన్నారు. ఏపీలో పీహెచ్‌సీల సంఖ్య.. జాతీయ సగటు కంటే ఎక్కువగానే ఉందని అన్నారు. డబ్ల్యూహెచ్‌వో ప్రకారం మెడికల్‌ ఆఫీసర్లు మన వద్ద ఎక్కువే ఉన్నారని.. ప్రస్తుతం రాష్ట్రంలో 1.15 లక్షల మంది వైద్యులు ఉన్నారని సీఎం చంద్రబాబు అన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos