ఏపీ మంత్రి లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్న క్రమంలో.. ఆయన మరోవైపు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ముంగిట చంద్రబాబును ప్రశాంత్ కిషోర్ కలవడం ద్వారా ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. అదే సమయంలో ఎన్నికల్లో టీడీపీ గెలుపొందుతుందని ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. అది ప్రజల్లోకి బాగా వెళ్ళి .. తెలుగుదేశం పార్టీకి ఎన్నికల్లో ప్రయోజనం చేకూర్చింది.
తాజాగా నారా లోకేష్ .. ప్రశాంత్ కిషోర్ తో సమావేశం కావడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. ఈ ఏడాది చివరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఏపీలో గత ఎనిమిది నెలల్లో నెలకొన్న రాజకీయ పరిణామాలు, కూటమి ప్రభుత్వ పాలనపై ప్రశాంత్ కిషోర్ ఒక రిపోర్ట్ లోకేష్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలతో పాటు అధిగమించాల్సిన అంశాల గురించి అందులో ప్రస్తావించినట్లు సమాచారం. ముఖ్యంగా వైసీపీని ఎలా నియంత్రించాలనేది ప్రశాంత్ కిషోర్ ఒక రిపోర్ట్ రూపంలో ఇచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీకి ఛాన్స్ ఇస్తే జగన్ దూకుడుగా ముందుకు వెళ్తారని.. అందుకే ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదని ప్రశాంత్ కిషోర్ లోకేష్ కు సూచించినట్లు సమాచారం.
కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైందని.. దానిని ప్రారంభంలోనే నియంత్రించాలని ప్రశాంత్ కిషోర్ లోకేష్ కు సూచించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలుపై ఫోకస్ చెయ్యాలని.. ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలను అమలు చేసి చూపించాలని ప్రశాంత్ కిషోర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అలాగే వైసీపీ ని ఎలా నియంత్రించవచ్చో కూడా వివరించినట్లు సమాచారం. అయితే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. ఎలక్షన్ ఫండింగ్ కోసమే లోకేష్ ను ప్రశాంత్ కిషోర్ కలిసినట్లు ఒక ప్రచారం ఉంది. అయితే ఇది ఉభయ కుశలోపరి సమావేశమని రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos