ఆకాశపు కాన్వాస్‌పై డ్రోన్లు గీసిన చిత్రాలు అబ్బురపరిచాయి. దేశంలోనే అతి పెద్ద డ్రోన్‌ షో అదరహో అనే రేంజ్‌లో జరిగింది. కృష్ణా తీరంలో…పున్నమి ఘాట్‌లో…పున్నమి వెలుగులను మించి డ్రోన్‌ హ్యాకథాన్‌ జరిగింది. ఒకటి కాదు రెండు కాదు..ఒకేసారి 5,500 డ్రోన్లు వెలుగులు విరజిమ్మూతూ ఆకాశంలోకి దూసుకెళ్లి పలు థీమ్‌లను ఆవిష్కరించాయి. దేశంలోనే అతి పెద్ద డ్రోన్‌ షోకి 22వ తేదీన అంటే నిన్న మంగళవారం విజయవాడ వేదికగా మారింది. ఆకాశంలో చుక్కలు కుప్పబోసినట్లు…నక్షత్రాల్లా మిలమిలా మెరిసిపోయాయి డ్రోన్లు. డ్రోన్ల తళుకుబెళుకుల ముందు నక్షత్రాలు చిన్నబోయాయి. ఇక ఈ డ్రోన్ షో ద్వారా అమరావతిలో ఒకే రోజు ఐదు ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. డ్రోన్ షో, లేజర్ షో అనంతరం సీఎం చంద్రబాబు నాయుడుకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఈ రికార్డులకు సంబంధించిన పత్రాలు అందించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ  డ్రోన్ షో ను ప్రారంభించారు. అమరావతి డ్రోన్ సమ్మిట్ – 2024 లో భాగంగా మంగళవారం సాయంత్రం పున్నమి ఘాట్ లో డ్రోన్ షో, లేజర్ షో, ఫైర్ వర్క్స్, సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. విజయవాడ నగరం నుంచి సందర్శకులు భారీగా రావడంతో కృష్ణానదీ తీరం జనసంద్రంగా మారింది. విజయవాడ నగరవాసులు డ్రోన్ షో వీక్షించేలా అధికారులు ఐదు ప్రాంతాల్లో డిస్ ప్లేలు ఏర్పాటు చేశారు. డ్రోన్ షోతో పాటు లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. ఇటీవల నిర్వహించిన డ్రోన్ హ్యాకథాన్ లో విజేతలకు సీఎం చంద్రబాబు చెక్కులు అందజేశారు. మొత్తానికి డ్రోన్ షో కు ఐదు గిన్నిస్ రికార్డులు రావడంతో అందరిలో ఆనందం వెల్లివిరిసింది.

ఆకాశంలో రకరకాల ఫార్మేషన్లతో డ్రోన్లు అందరిని ఆకట్టుకున్నాయి. అవి పలు రకాల థీమ్‌లను ప్రదర్శించాయి. డ్రోన్ల కాంతులు…వినీలాకాశంలో రకరకాల ఆకారాలకు ప్రాణం పోశాయి. 1911 ఇండియా కమ్మెమోరేటివ్‌ పోస్టేజ్‌ స్టాంప్‌ ఆకారంలో ఫార్మ్‌ అయిన డ్రోన్లను చూసి, ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అమరావతి థీమ్‌కు చిహ్నంగా…డ్రోన్లు గీసిన బుద్ధుడి చిత్రాన్ని చూసి అచ్చెరువొందారు వీక్షకులు. ఇక విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌, యూఏవీలకు చిహ్నంగా థీమ్స్‌ను ప్రదర్శించాయి డ్రోన్లు. ఆ తర్వాత జయహో మ్యూజిక్‌ వస్తుండగా జాతీయ జెండాను ప్రదర్శించాయి డ్రోన్లు. ఆకాశం అనే కాన్వాస్‌ మీద…చెయ్యి తిరిగిన చిత్రకారుడు కుంచె పెట్టి గీసినట్లు…డ్రోన్లు గీసిన చిత్రాలను చూసి చిత్తరువులా మారిపోయారు జనం.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos