ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యల వివాదం కొనసాగుతోంది. కోనసీమ పర్యటన వేళ పవన్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు సీరియస్ అవుతున్నారు. పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ నేతల దిష్టి తగిలిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారనే ప్రచారం సాగింది. పవన్ రాష్ట్ర విభజన అంశాన్ని పవన్ ప్రస్తావించటంపై కూడా తెలంగాణ నేతలు మండిపడుతూ తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ మంత్రులు, పీసీసీ చీఫ్, ఎమ్మెల్యేలు .. పవన్ లక్ష్యంగా సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి ఘాటుగా స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ క్షమాపణ చెబితే తెలంగాణలో ఆయన సినిమా ఒకటి, రెండు రోజులు ఆడుతుందని, లేకుంటే సినిమాలు ఆడనివ్వమని కోమటిరెడ్డి హెచ్చరించారు. కాగా, పవన్ వ్యాఖ్యలపై వివాదం ముదురుతున్న వేళ జనసేన స్పందించి.. వ్యాఖ్యలను వక్రీకరించవద్దని కోరింది. ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొన్న క్రమంలో ఆ మాటలు వక్రీకరించవద్దని జనసేన పార్టీ వివరణలో భాగంగా స్పష్టం చేసింది.
ఈ క్రమంలో తాజాగా సీపీఐ జాతీయ నేత నారాయణ ఇదే అంశంపై స్పందిస్తూ సంచలన డిమాండ్ చేసారు. పవన్ శైలితో తెలుగు ప్రజల ఐక్యత దెబ్బ తినే అవకాశం ఉందని, అందువల్ల పవన్ ను కేబినెట్ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల విభజన బౌగోళికంగా జరిగింది కానీ, రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని చెప్పుకొచ్చారు. పవన్ మొదట్లో చెగువేరా అన్నారని.. ఇప్పుడు సావర్కర్ శిష్యుడిగా మారారని ఎద్దేవా చేసారు. ఇంతకాలం సనాతన ధర్మం పేరుతో తిరుగుతూ.. ఇప్పుడు తాజాగా దిష్టి పేరుతో మాట్లాడుతున్నారని పవన్ పైన కీలక వ్యాఖ్యలు చేసారు. పవన్ సనాతన ధర్మం పేరుతో తిరగవచ్చని.. అయితే, డిప్యూటీ సీఎంగా ఉంటూ అలా మాట్లాడటం కుదరదని నారాయణ వ్యాఖ్యానించారు. ఇప్పుడు సీపీఐ నారాయణ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos