ఏపీని మొంథా తుఫాను వెంటాడుతోంది. ఈ రోజు రాత్రికి కాకినాడ సమీపంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తుఫాను వేళ విమానాలు.. రైళ్లు రద్దయ్యాయి. పలు ప్రాంతాల్లో బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. ఇప్పటికే తుఫాను ప్రభావం విశాఖ, కాకినాడ లో మొదలైంది. ప్రభుత్వ యంత్రాంగం తుఫాను సహాయక చర్యల పైన సమాయత్తం అయింది. ఇదే సమయంలో కూటమి నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. తుఫాను చర్యల పైన సీఎం చంద్రబాబు కూటమి పార్టీల నేతలతో టెలికాన్ఫిరెన్స్ నిర్వహించారు. తుపాను కారణంగా నేడు, రేపు అప్రమత్తంగా ఉండి ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని నేతలకు సీఎం పిలుపునిచ్చారు. లీడర్ నుంచి కేడర్ వరకు ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలంతా ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. మొంథా తుఫాన్ రాష్ట్రంపై ప్రభావం చూపే అవకాశం ఉందని.. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం కాకినాడకు 270 కి.మీ దూరం నుంచి 15 కి.మీ వేగంతో రాష్ట్రం వైపు వస్తోందని తెలియజేశారు.

ఈ రోజు రాత్రికి తుఫాను తీవ్ర రూపం దాల్చి మచిలీపట్నం - కళింగపట్నం మధ్య తీరం దాటుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. తుపాన్ ప్రభావంతో కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఎన్డీయే శ్రేణులు నేడు, రేపు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచనలు చేశారు. పరిస్థితి తీవ్రతను బట్టి రియల్ టైంలోనే మొబైల్ ఫోన్లకు సందేశాలు పంపిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. పంటలను మునకనుంచి కాపాడేందుకు ఏం చర్యలు తీసుకోవాలో అధికారులకు తెలియజేశామని.. ప్రాణ నష్టాన్ని పూర్తిగా తగ్గించడంతో పాటు ఆస్తి నష్ట నివారణకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రజలను చైతన్యపరుస్తూ ఎన్డీయే కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దాదాపు 39 నియోజకవర్గాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా చూపిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos