ఏపీలోని విశాఖపట్నం నగరంలో భూకంపం సంభవించింది. ఈ రోజు మంగళవారం తెల్లవారుజామున ఉదయం 4:16 నుంచి 4:20 గంటల మధ్య భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే చాలామంది గాఢ నిద్రలో ఉండగా అకస్మాత్తుగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో.. కుటుంబసభ్యులతో కలిసి ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.7గా నమోదైనట్లు జాతీయ భూకంప పరిశోధనా కేంద్రం (NCS) వెల్లడించింది. భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో కేంద్ర బిందువు (epicentre) నమోదైనట్లు తేలింది. ఈ కేంద్రం అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల ప్రాంతంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. విశాఖ నగరంలోని గాజువాక, మధురవాడ, రిషికొండ, భీమిలి, మహారాణిపేట, కైలాసపురం, విశాలాక్షినగర్, రాంనగర్, మురళీనగర్, అక్కయ్యపాలెం, కొంతమేరకు గాజువాక సమీప తీరప్రాంతాలు, భీమ్‌లిపట్నం మండల పరిసర గ్రామాల్లో భూకంప ప్రకంపనల ప్రభావం ఉంది. అకస్మాత్తుగా సంభవించిన ఈ పరిణామంతో నిద్ర నుంచి ఉలిక్కిపడిన నగరవాసులు ఏం జరుగుతోందో తెలియక ఆందోళన చెందారు. భయంతో కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్ల నుంచి బయటకు వచ్చి రోడ్లపై గుమికూడారు. కొంతసేపటి వరకు ఇళ్లలోకి వెళ్లడానికి కూడా జంకారు. అయితే, ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై ఎంత నమోదైందనే వివరాలు ఇంకా అధికారికంగా వెలువడలేదు. ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకపోవడంతో నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos