ఏపీలో గత ఐదేళ్లలో వైసీపీ నేతలు పాల్పడిన అక్రమాల, అరాచకాల చిట్టా... కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక క్రమేణ ఒక్కొక్కటే వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా కాకినాడ పోర్టు వ్య‌వ‌హారంలో వైసీపీ సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి వ్యవహారం సంచలనం కలిగిస్తోంది. విజయ్ సాయి రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) మ‌రోసారి నోటీసులు జారీ చేసింది.

ఇప్ప‌టికే ప‌లు నోటీసులు జారీ చేసినప్పటికీ వివిధ‌ కార‌ణాల‌తో ఆయ‌న విచార‌ణ‌కు హాజ‌రుకాలేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌ళ్లీ నోటీసులు జారీ చేసిన ఈడీ.. సోమ‌వారం త‌మ ఎదుట‌ విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశించింది. కాకినాడ సీ పోర్టు లిమిటెడ్‌, సెజ్‌లో... కాకినాడ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (కేఐహెచ్ పీఎల్) అధినేత కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీ రావు) వాటాల‌ను బ‌ల‌వంతంగా లాక్కున్నార‌ని విజ‌య‌సాయిరెడ్డి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలో కేవీ రావు ఫిర్యాదును ప‌రిశీలించిన ఈడీ.. విజ‌య‌సాయిరెడ్డి మ‌నీ లాండ‌రింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు గుర్తించి... ఆ మేర‌కు ఆయ‌న‌కు నోటీసులు జారీ చేసింది.

 అయితే, ఇప్ప‌టికే జారీ చేసిన నోటీసుల‌కు ప‌లు కార‌ణాల‌తో విచార‌ణ‌కు హాజరుకాలేనంటూ విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు. ఇక తాజా నోటీసుల నేప‌థ్యంలో ఆయ‌న విచార‌ణ‌కు హాజ‌ర‌వుతారా.. లేదా అనేది చూడాల్సి ఉంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos