ఏపీలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కార్యాలయం..నివాసంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఎంవీవీ పలు సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. భూ ఆక్రమణ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంవీవీతో పాటుగా ఆయన సన్నిహితుల నివాసాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. విశాఖపట్నం పరిధిలో నమోదు చేసిన కేసులు ఆధారంగా ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలిసింది.

సత్యనారాయణ నివాసంతో పాటుగా మధురవాడలోని కార్యాలయంలోనూ సోదాలు చేస్తున్నారు. ఎంవీవీతో పాటుగా ఆడిటర్‌ వెంకటేశ్వరరావు, గద్దె బ్రహ్మాజీ నివాసాలు, కార్యాలయాల్లోనూ ఈడీ సోదాలను నిర్వహిస్తున్నది. మొత్తం ఐదు చోట్ల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సోదాలు నిర్వహిస్తున్నది. ఎంవీవీ సత్యనారాయణపై మోసం, కుట్ర, ఫోర్జరీ వంటి ఆరోపణలతో కేసు నమోదయింది. వీటిల్లో ఇప్పటికే ఎంవీవీ హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్‌ తెచ్చుకున్నారు.

ఎంవీవీకి ఆడిటర్ గా వ్యవహరిస్తున్న జీవీ నివాసంలోనూ సోదాలు జరుగుతున్నాయి. హయగ్రీవా ఇన్‌ఫ్రాటెక్‌, కన్‌స్ట్రక్షన్స్‌ కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మధురవాడ భూమి కొనుగోలు కేసులో ఈడీ సోదాలు చేస్తున్నదని తెలుస్తోంది. దాదాపుగా రూ.12.5 కోట్ల లావాదేవీల వ్యవహారంలో ఎంవీవీపై ఈడీ కేసు నమోదు అయింది. ఎంవీవీ పలు తెలుగు సినిమాలను నిర్మించారు. గీతాంజలి, అభినేత్రి, నీవెవరు వంటి సినిమాలను ఎంవీవీ నిర్మించారు. కాగా, 2006-08 మధ్య జరిగిన లావాదేవీలపై ఈడీ కేసు నమోదు అయింది.

ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ బిల్డర్. ఫోర్జరీ చేసి విక్రయ పత్రాలను కూడా తయారు చేశారని ఆరోపణలున్నాయి. హయగ్రీవ కనస్ట్రక్షన్స్ సంస్థ విశాఖ పరిధిలో వృద్ధాశ్రమం, అనాధాశ్రమాన్ని నిర్మించడానికి 2008లో ప్రభుత్వం నుంచి 12.51 ఎకరాలను అప్పట్లో మార్కెట్ రేటుకు కొనుగోలు చేసింది. ఈ స్థలానికి సంబంధించి తరువాతి కాలంలో అనేక ఫిర్యాదులు వచ్చాయి. కాగా, 2019లో విశాఖ నుంచి ఎంవీవీ వైసీపీ ఎంపీగా గెలిచారు. తాజా ఎన్నికల్లో విశాఖ తూర్పు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఈడీ సోదాల గురించి అధికారికంగా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఏం గుర్తించారనేది వెల్లడించాల్సి ఉంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos