తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వివాదాస్పదం అవుతోంది. ఎన్నికల్లో పాల్గొనాల్సిన వైసీపీ కార్పొరేటర్లను కూటమి నేతలు బంధిస్తున్నారని వైసీపీ ఇంఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి ఆరోపించారు. చిత్తూరులోని ఓ ప్రైవేట్ హోటల్ లో వైసీపీ కార్పొరేటర్లను బంధించారంటూ భూమన అభినయ్ రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వైసీపీ కార్పొరేటర్లు పాల్గొనకుండా అడ్డుకుంటున్నారని, తాము చెప్పిన వారికి మద్దతివ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

జనసేన ఎమ్మెల్యే కుమారుడు ఆరని మదన్ ఆదివారం అర్ధరాత్రి వైస్సార్సీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి చిత్తూరుకు తరలించారని సంచలన విషయాలు వెల్లడించారు. వైస్సార్సీపీ కార్పొరేటర్లను బలవంతంగా అక్కడ ఎందుకు ఉంచారని, ఆ ప్రైవేట్ ప్రాంతం నుంచి వారిని పంపాలని కోరారు. వారిని అడ్డుకునేందుకు కూటమి నేతలు యత్నించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు అక్కడికి వచ్చి అంతా కంట్రోల్ చేశారు. కొంత సమయం తరువాత వైసీపీ కార్పొరేటర్లు అక్కడి నుంచి వెనుతిరిగారు.

వైసీపీ కార్పొరేటర్ రాజేష్ ను ఎలాంటి నోటీసులు లేకుండా అలిపిరి పోలీసులు అరెస్టు చేశారని వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డి ఆరోపించారు. సురేష్ అరెస్ట్ గురించి తెలుసుకున్న అభినయ్ రెడ్డి అలిపిరి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. వైసీపీ కార్పొరేటర్ రాజేష్ ను బయటకు పంపాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికకు వైసీపీ కార్పొరేటర్లను రానివ్వకుండా ఎక్కడ పడితే అక్కడ నిర్బంధిస్తున్నారని ఆరోపించారు. 

ఇవాళ తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతున్న క్రమంలో వైసీపీ కార్పొరేటర్లను ఓటింగ్ లో పాల్గొనకుండా చేసేందుకు అర్ధరాత్రి వారిని కిడ్నాప్ చేసి, బలవంతంగా హోటల్ కు తరలించారని భూమన అభినయ్ రెడ్డి ఆరోపించారు. హోటల్ బయట కారు అడ్డుపెట్టి, మనుషులను పెట్టి వైసీపీ నేతల్ని భయభ్రాంతులకు గురిచేశారని చెప్పారు. వారిని విడిపించేందుకు వెళ్లగా తనను సైతం కూటమి నేతలు, వారి మనుషులు అడ్డుకున్నారని తెలిపారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కుమారుడు ఆరణి మదన్, టీడీపీ నేతలు హోటల్ వద్దకు వచ్చి తమను అడ్డుకోగా.. పోలీసులు రావడంతో వెనక్కి తగ్గారని భూమన అభినయ్ రెడ్డి వెల్లడించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos