విద్యుత్ చార్జీలు పెంచమని, ప్రజలపై భారం వేయమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గురువారం అమరావతి లోని తాళ్లాయపాలెంలో రాష్ట్రంలో తొలి గ్యాస్ ఆధారిత సబ్ స్టేషన్ ను చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి సమస్యలు లేకుండా సబ్ స్టేషన్లు ఏర్పాటు చేసుకుంటున్నామని... ఇవాళ శంకుస్థాపన చేసిన పనులు ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పారు. అమరావతిలో విద్యుత్ సరఫరా సమస్య లేకుండా సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. మేము అధికారంలో ఉన్నంత వరకు విద్యుత్ చార్జీలు పెంచమని చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచింది.. మీరు ఆ ప్రభుత్వానికి కర్రుకాల్చి వాతపెట్టారని అన్నారు.
గత వైసీపీ ప్రభుత్వ పాలనపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం లాలూచీ పడి విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి చేశారని అన్నారు. దుర్మార్గపు ఆలోచనలతో విద్యుత్ ఒప్పందాలను జగన్ రద్దు చేశారు. పీపీఏల రద్దుపై కోర్టులు మొట్టికాయలు వేసినా మారలేదు. వాడని విద్యుత్ కు రూ. 9వేల కోట్లు చెల్లించాల్సి వచ్చిందని చంద్రబాబు అన్నారు. తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.32,166 కోట్ల భారం మోపారని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయటపడేసేందుకు ఒక్కో ఇటుక పేర్చుతున్నామని చంద్రబాబు చెప్పారు.
గత ప్రభుత్వంలో రూ. 10లక్షల కోట్ల అప్పులు చేసి... ఖజానా ఖాళీ చేశారని... ఒక్క రూపాయి కూడా గల్లా పెట్టెలో లేదని... ఉపాధి హామీ పథకం నిధులు కూడా దారి మళ్లించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్రాంతి నాటికి గ్రామీణ రోడ్లలో గుంతలు లేకుండా చేస్తామని చెప్పారు. వైసీపీకి 11 కాదు ఒక్క ఎమ్మెల్యే సీటు గెలవడానికి అర్హత లేదు.. అసలు రాజకీయాల్లో ఉండటానికి కూడా అనర్హులు అంటూ చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos