ఏపీ పాలిసెట్‌ ఫలితాలు విడుదలకు సంబంధించి అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఏపీ పాలిసెట్‌ రిజల్ట్స్‌ విడుదలకు సంబంధించి రకరకాల తేదీలు మీడియాలో సర్య్కులేట్‌ అవుతుండటంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. అయితే.. అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రం మే మూడో వారంలో ర్యాంక్‌ కార్డ్‌ పొందొచ్చు అని స్పష్టంగా తెలియజేసి ఉంది. అయితే.. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఏ క్షణమైనా ఏపీ పాలిసెట్‌ 2025 రిజల్ట్స్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. లేటెస్ట్‌ మీడియా రిపోర్ట్స్‌ ప్రకారం.. మే 14 లేదా 15న రిజల్ట్‌ విడుదలయ్యే సూచనలున్నాయి. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ https://polycetap.nic.in/ చెక్‌ చేసుకుంటూ ఉండాలి.

ఆంధ్రప్రదేశ్‌ పాలిసెట్‌ ఎగ్జామ్‌ 2025 ఏప్రిల్‌ 30వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పాలిసెట్‌ 2025 నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 500 పరీక్ష కేంద్రాలలో ఈ పరీక్ష నిర్వహించారు. తప్పు సమాధానానికి నెగిటివ్‌ మార్కింగ్‌ ఉండదు. అయితే.. విద్యార్థులు సాధించే మార్కుల ఆధారంగా ర్యాంక్‌లు ప్రకటిస్తారు. వీటితో రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్‌ పరీక్షకు ఈసారి 89 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పాలిసెట్‌కు 1,57,482 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 1,39,749 మంది పరీక్ష రాశారు. అత్యధికంగా అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో 94 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. అయితే.. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ కీ మే 2వ తేదీన విడుదల చేశారు. ఏపీ పాలిసెట్‌ పరీక్ష ఫలితాలు ప్రకటించిన తర్వాత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ కూడా ప్రకటిస్తారు. అడ్మిషన్‌లో భాగంగా అభ్యర్థులకు ఈ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. మంచి స్కోర్‌ సొంతం చేసుకున్న అభ్యర్థులు డిప్లొమా ప్రోగ్రామ్స్‌లో సీట్‌ పొందొచ్చు. ఈ పాలిసెట్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ద్వారా పాలిటెక్నిక్‌ కాలేజీల్లోని వివిధ ఇంజినీరింగ్‌, నాన్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.

ఏపీ పాలిసెట్‌ ఫలితాలు ఇలా చెక్‌ చేసుకోవాలి..

మొదట ఏపీ పాలిసెట్‌ అధికారిక వెబ్‌సైట్‌ https://polycetap.nic.in/ ఓపెన్‌ చేయాలి.
అక్కడ ఏపీ పాలిసెంట్‌ ఫలితాలు 2025 లింక్‌పై క్లిక్‌ చేయాలి.
ఆ తర్వాత కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది.
అక్కడ మీ లాగిన్‌ వివరాలు నమోదు చేసి.. సబ్మిట్‌ చేయగానే ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
భవిష్యత్తు అవసరాల కోసం ర్యాంక్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos