తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేసియా అందించనున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ మేరకు ప్రకటన చేశారు.
గురువారం ఉదయం తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో క్షతగాత్రులను మంత్రి అనగాని సత్యప్రసాద్ పరామర్శించారు. హోంమంత్రి అనిత, రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కూడా బాధితులను పరామర్శించారు. అనంతరం మంత్రి అనగాని సత్యప్రసాద్ నష్టపరిహారాన్ని ప్రకటించారు. తొక్కిసలాటలో ఆరుగురు చనిపోవడం తన మనసును తీవ్రంగా కలచివేసిందని ఆయన విచారం వ్యక్తం చేశారు.
మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హాస్పిటల్‌కు చేరుకొని బాధితులను పరామర్శించనున్నారు. రుయాతో పాటు స్విమ్స్ హాస్పిటల్‌లో కూడా క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా, ఈ విషాదం నేపథ్యంలో సీఎం చంద్రబాబు సహా పలువురు మంత్రులు తమ కార్యక్రమాలను వాయిదా వేసుకున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos