రెండు తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు బెంబేలెత్తిస్తోన్నాయి. తాజాగా ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 9 మందికి పైగా ప్రయాణికులు దుర్మరణం పాలైనట్లు సమాచారం. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేట్ బస్సు అది. ఇవ్వడం శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో  ఈ ప్రమాదం జరిగింది. చింతూరు- మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో అదుపు తప్పి లోయలో పడింది.

ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వారందరూ చిత్తూరు జిల్లాకు చెందిన స్థానికులుగా గుర్తించారు. వారి వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన కొందరు యాత్రికులు ప్రైవేట్ బస్సు (నంబర్ ఏపీ 39 యూఎం 6543) లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల సందర్శన కోసం బయలుదేరారు. గురువారం రాత్రి భద్రాచలం ఆలయ దర్శనానంతరం అన్నవరానికి బయలుదేరారు. చింతూరు- మారేడుమిల్లి మీదుగా అన్నవరానికి చేరుకోవాల్సి ఉండగా.. ఘాట్ రోడ్డులో ప్రమాదానికి గురైంది. మలుపులో అదుపు తప్పి.. చూస్తుండగానే 50 అడుగుల లోతు ఉన్న లోయలో పడింది.

ప్రమాద సమయంలో బస్సులో 35 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. బస్సు పల్టీలు కొడుతూ లోయలో పడి మొత్తం నుజ్జునుజ్జు అయింది. యాత్రీకులు నలిగిపోయారు. వారిలో 9 మంది దుర్మరణం పాలైనట్లు తెలుస్తోంది. కొందరు కిటికీల గుండా బయటపడ్డారు. ఒకవైపు చలి, మరోవైపు చీకట్లో నరకాన్ని చవి చూశారు. ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు ఈ సమాచారాన్ని పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని .. సహాయక చర్యలు చేపట్టారు. ఈ దుర్ఘటన సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులు, బంధువులకు తెలియజేశారు. మరోవంక.. ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలు భారీగా స్తంభించిపోయాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos