టీడీపీ కీలక నేత, ఫైబర్‌నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అలాగే టీడీపీకి, పార్టీ పదవులను కూడా వదులుకుంటున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇకపై పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను సీఎం చంద్రబాబు నాయుడికి పంపించారు. "వ్యక్తిగత కారణాలతో నేను తెలుగు దేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం, జాతీయ అధికార ప్రతినిధి హెూదా, ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ చైర్మన్ పదవుల నుంచి రాజీనామా చేస్తున్నాను. మీరు నాపై ఉంచిన విశ్వాసానికి, అందించిన మద్దతుకు, నాకు ఈ కీలకమైన బాధ్యతలను నిర్వహించే అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగు దేశం పార్టీ మరింత బలంగా ఎదిగి ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షిస్తున్నాను. ఇక మీదట పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతాను. భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదు." అని ఆయన లేఖలో పేర్కొన్నారు.

కాగా ఫైబర్‌నెట్ ఎండీ, IAS దినేశ్ కుమార్ అవినీతికి పాల్పడ్డారని జీవీ రెడ్డి ఇటీవల ఆరోపించారు. దీనిపై జీవీ రెడ్డిని సీఎం చంద్రబాబు మందలించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఏపీ ఫైబర్‌నెట్ లిమిటెడ్‌లో గత కొద్దిరోజులుగా పంచాయితీ నడుస్తోంది. ఫైబర్ నెట్ ఎండీ దినేశ్‌ కుమార్‌పై జీవీ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేయడం సంచలనం రేకెత్తించింది. ఏపీ ఫైబర్‌నెట్‌ సంస్థను చంపేయాలని దినేశ్‌ కుమార్ కుట్రలు పన్నుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లగా.. జీవీ రెడ్డిని పిలిపించుకుని మాట్లాడారని, సమస్యను పరిష్కరించుకునే విధానం ఇలా కాదని.. మంత్రి దృష్టికి లేదా సీఎస్ దృష్టికి తీసుకురావాల్సిందని సూచించినట్లు తెలిసింది. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో..  తాను రాజీనామా చేస్తున్నట్లు జీవీ రెడ్డి  సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.      ఎన్నికలకు చాలా కాలం ముందే టీడీపీలో చేరిన జీవీ రెడ్డి కి మంచి వాగ్దాటి ఉండటంతో అధికార ప్రతినిది హోదా ఇచ్చారు. టీవీ చర్చల్లో ధాటిగా టీడీపీని సమర్థించేవారు. వైసీపీ తీరును ఎండగట్టే వారు. జీవీ రెడ్డి వ్యవహారంపై టీడీపీ క్యాడర్ లో సానుభూతి ఉంది. ఆయన వివాదాల వల్ల ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేయవచ్చు కానీ.. పార్టీకి రాజీనామా చేయకుండా ఉండాల్సిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos