ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లి రైతులను కలిసి వారిని పరామర్శించడంతో పాటు ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు విరుచుకుపడుతున్నారు. తాజాగా మంత్రి బాల వీరాంజనేయ స్వామి గుంటూరులో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా జగన్ మిర్చి యార్డుకు వెళ్లి న్యూసెన్స్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లి రైతులపై ప్రేమ ఉన్నట్టు జగన్ మాట్లాడుతున్నాడని, గత ప్రభుత్వ హయాంలో రైతులను అడుగడుగున మోసం చేశారన్నారు. రైతు భరోసా నిధులు ఇవ్వకుండా గత ప్రభుత్వంలో రైతులను జగన్ ఇబ్బంది పెట్టారని, అటువంటి జగన్ కు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. జగన్ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మరని, అన్నివిధాల జగన్ తిరస్కరణకు గురయ్యారు కాబట్టే ప్రజలు 11సీట్లు ఇచ్చి అధికారం నుంచి దూరం చేశారని తెలిపారు. పోలీసులను బట్టలూడదీసి కొడతామని జగన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మంత్రి బాల వీరాంజనేయ స్వామి మండిపడ్డారు.

సప్త సముద్రాలు దాటి వచ్చి అయినా అన్యాయం చేసిన పోలీసు అధికారుల బట్టలూడదీసి నిలబెడతామని జగన్ చేసిన వ్యాఖ్యల పైన మండిపడ్డారు. సప్త సముద్రాలు జగన్ దాటాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని, ఆయనకు ఆ శక్తి లేదని జగన్ పని అయిపోయిందని మంత్రి పేర్కొన్నారు. జగన్ కు మళ్ళీ అధికారం అందని ద్రాక్ష అంటూ మంత్రి బాల వీరాంజనేయ స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన జగన్ పైనా,ఆయన అనుచరుల పైనా కేసులు పెట్టి జైలుకు పంపాలని మంత్రి అన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos