గేమ్ చేంజర్ సినిమా విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది ఈ చిత్రం. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ సైతం అభిమానుల అంచనాలను రెట్టింపు చేసేలా  ఉంది. ఇప్పటికే ఏపీలో ఈ చిత్రానికి సంబంధించి మెగా ఈవెంట్ ఉంది.

తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలో 40 ఎకరాల విస్తీర్ణంలో నేడు మెగా ఈవెంట్ జరగనుంది. ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ రాబోతున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు మెగా అభిమానులు. ఈవెంట్ కు లక్ష మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.  కాగా.. పవన్ కళ్యాణ్ ఈవెంట్ సందర్భంగా ఏం చెప్పబోతున్నారన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. పుష్ప 2 విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. అటు తరువాత సినీ పరిశ్రమకు చెందిన కార్యక్రమం ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ హాజరవుతుండడం అందరి దృష్టిని ఆకర్షించింది.

పవన్ ప్రసంగం ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు లబ్ధి కలిగించేలా పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమను ఏపీకి ఆహ్వానిస్తారని కూడా సమాచారం. ఇదే వేదికపై కొన్ని రకాల రాయితీలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం నడుస్తోంది. పవన్ కళ్యాణ్ స్వయంగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తి కావడం.. కష్టనష్టాల పట్ల పూర్తిస్థాయిలో అవగాహన ఉండటం వల్ల ఇండస్ట్రీకి మేలు కలిగేలా ప్రకటనలు చేస్తారని ఆశిస్తున్నారు సినీ పెద్దలు. ఈ నేపథ్యంలో పవన్ ఎలాంటి ప్రకటనలు చేస్తారో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos