ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. అమరావతి ఏపీ రాజధాని గా పార్లమెంట్ ఖరారు చేస్తూ రాజముద్ర వేసేందుకు తుది కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు ఏపీ పునర్విభజన చట్టంలో సవరణల దిశగా బిల్లు సిద్దం అయింది. రేపు బుధవారం పార్లమెంట్ లో ఈ బిల్లు ప్రవేశ పెట్టనున్నారు. ఆమోదం లాంఛనంగానే కనిపిస్తోంది. దీని ద్వారా అమరావతి శాశ్వత రాజధానిగా అమరావతి నిలిచిపోనుంది. రాజధాని నిర్మాణం వేళ ఈ నిర్ణయం రైతులకు బిగ్ రిలీఫ్ గా మారనుంది.
అమరావతి బిల్లుపైన రేపు జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదించనున్నారు. ఆ వెంటనే లోక్ సభలో కేంద్ర హోం మంత్రి ఏపీ పునర్విభజన చట్టం సవరణ కోసం బిల్లును ప్రతిపాదించనున్నారు. 2014 లో చేసిన ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగనుంది. ఈ గడువు పూర్తి కావటంతో.. 2024 జూన్ 2వ తేదీ నుంచి ఏపీ రాజధానిగా అమరావతి గుర్తిస్తూ ఈ బిల్లును సభలో ప్రవేశ పెడుతున్నారు. లోక్ సభలో ఆమోదం తరువాత రాజ్యసభలోనూ బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదించనున్నారు. దీని ద్వారా ఇక అమరావతి ఏపీ శాశ్వత రాజధానిగా రాజముద్ర పడనుంది.
ఇప్పటికే అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించాలని కోరుతూ ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మూడు రాజధానుల ప్రతిపాదనలతో అమరావతి రైతుల్లో ఆందోళన మొదలైంది. దీంతో ప్రభుత్వం రెండో విడత భూ సమీకరణ చేస్తున్న వేళ అమరావతికి చట్టబద్దత కల్పించాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. దీంతో ప్రభుత్వం ఈ దిశగా కేంద్రంతో సంప్రదింపులు చేసింది. కేంద్రం సూచనల మేరకు రాష్ట్రంలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదించారు. కాగా అసెంబ్లీ తీర్మాన సమయంలో వైసీపీ గైర్హాజరు అయింది. ఇక.. ఇప్పుడు పార్లమెంట్ లో బిల్లుకు చట్టబద్దత వేళ వైసీపీ హాజరై తమ అభ్యంతరాలను చెబుతూనే.. బిల్లుకు మద్దతు ఇస్తారని పార్టీ నేతల సమాచారం. అయితే, అమరావతి పై పార్లమెంట్ లో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఈ పునర్విభజన చట్టం సవరణ బిల్లుకు ఆమోదం లభించటం లాంఛనమే.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos