తిరుపతి రైల్యే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రెండు బోగీల్లో మంటలు చెలరేగాయి. రైలు బోగీల నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. బీమాస్ హోటల్ వెనక భాగంలో ప్రమాదం జరిగింది. హిస్సార్ టు తిరుపతి (04717) ట్రైన్‌ లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రెండు బోగీలు దగ్ధం అయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సహాయంతో రెండు బోగీల్లో మంటలను అదుపులోకి తెచ్చారు. హిస్సార్‌ ఎక్స్‌ప్రెస్‌ తిరుపతి రైల్వేస్టేషన్‌ కు వచ్చి ప్రయాణికులను రైల్వే స్టేషన్‌లో దింపేసిన తర్వాత యార్డులోకి వెళ్లే క్రమంలో ఇంజిన్‌ వెనకపైపు ఉన్న బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. అయితే తిరుపతి రైల్వే స్టేషన్ లో ఇతర రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేదని రైల్వే అధికారులు పేర్కొన్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరే రైళ్లు కానీ.. స్టేషన్ కు వచ్చే రైళ్లు కానీ ఎలాంటి ఆలస్యం లేదని తెలిపారు. ఈ అగ్నిప్రమాదంతో తిరుపతి రైల్వే స్టేషన్ లో ఉన్న ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. రైల్వే అధికారులు ప్రమాద కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos