ఏపీ సచివాలయం రెండో బ్లాక్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. రెండో బ్లాక్‌లో బ్యాటరీలు ఉండే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమిక అంచనా వేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బందికి ఎస్పీఎఫ్ సిబ్బంది సమాచారం ఇచ్చారు. వెంటనే సచివాలయం లోని రెండో బ్లాక్ వద్దకు చేరుకుని మంటలను ఫైర్ సేఫ్టీ సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదవశాత్తు ఈ సంఘటన జరిగిందా కుట్ర కోణం ఏమైనా ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

నిత్యం రద్దీగా ఉండే సచివాలయంలో ఈ ప్రమాదం జరగటం పైన ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. కాగా, ఈ రెండో బ్లాక్‌లోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, హోం మంత్రి వంగలపూడి అనిత పేషీలు ఉన్నాయి.

తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరగడంతో సిబ్బంది ఎవరూ కార్యాలయం లోపల లేరని సమాచారం. బ్యాటరీల రూమ్ లో చోటు చేసుకున్న మార్పుల కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అయితే, ఎలాంటి నష్టం జరగలేదని చెబుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల కోసం అధికారులు ఆరా తీస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos