ఈ నెల 23 నుంచి నెల రోజులపాటు ఇంటింటికీ తొలి అడుగు విజయయాత్ర జరపాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు సూచించారు. పార్టీ సంస్థాగత కమిటీలు త్వరగా పూర్తి చేయాలని..పార్టీ కోసం పని చేసేవారికి వాటిలో చోటు కల్పించాలని ఆయన నాయకులను ఆదేశించారు. తల్లికి వందనం నిధులు విడుదలతో సర్వత్రా సంతృప్తి వ్యక్తం అవుతోందని,వచ్చే వారమే అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని ఆయన తెలిపారు. ఒకే నెలలో రెండు సూపర్ - 6 పథకాలు అమలు చేసి చూపిస్తున్నామని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలు, గ్రామస్థాయి కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయయాత్రలో లీడర్‌ నుంచి కేడర్‌ వరకూ ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను, చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని కూటమి కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. తొలి ఏడాది చేసింది చెప్పడంతో పాటు ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నా ముఖ్య పథకాలను ఏడాదిలోపే అమలు చేస్తున్నామని, ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం నిబంధనలు కూడా మార్చకుండా తల్లికి వందనం పథకాన్ని మెరుగ్గా ఇస్తున్నామని చెప్పారు. పిల్లలందరికీ ఈ పథకాన్ని అమలు చేస్తున్నా కొందరు పనిగట్టుకుని బుద్ధి, జ్ఞానం లేకుండా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నెల 20వ తేదీన అన్నదాతా…సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. మహానాడు విజయవంతమైందని సేద తీరొద్దని, పార్టీ సంస్థాగత కమిటీలు పూర్తి చేయాలని చెప్పారు. పార్టీ కోసం కష్టపడేవారికి అవకాశం కల్పించాలని, అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకొని కమిటీల్లో స్థానం కల్పించాలని పేర్కొన్నారు. జులై నుంచి కార్యకర్తలు, నేతలకు నాయకత్వ శిక్షణా శిబిరాలు నిర్వహిస్తామన్నారు. అధికారంలో లేనప్పుడు కార్యకర్తలు చాలా కష్టపడ్డారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎమ్మెల్యేలు కూడా ప్రతి రోజూ పార్టీ కార్యక్రమాలకు కొంత సమయం కేటాయించాలని, ప్రజలతో నిత్యం కలుపుగోలుతనంతో మెలగాలని సూచించారు.

యోగాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా రెండు కోట్ల మందితో నిర్వహించాలని సంకల్పిస్తే 2.21 కోట్ల మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీని ప్రపంచపటంలో నిలిపేందుకు చేపట్టిన ఉద్యమమని చెప్పారు. విశాఖలో ఐదు లక్షల మందితో ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో మూడు రోజులు పాల్గొంటే సర్టిఫికేట్‌ ఇస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా యోగా సన్నద్ధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు పార్టీ నేతలు, కార్యకర్తలు వాటిలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అన్న క్యాంటీన్ల ద్వారా నాలుగు కోట్ల భోజనాలు సరఫరా చేసినట్టు చంద్రబాబు వివరించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos