ఏపీలోని గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి సింగపూర్‌కు ఇండిగో సేవలు పునఃప్రారంభం అయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసుల విస్తరణలో మరో ముఖ్యమైన పురోగతి సాధించినట్లు అయ్యింది. ఐదేళ్ల విరామం తర్వాత గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు ఇండిగో విమాన సేవలు మళ్లీ ప్రారంభం అయ్యాయి. ఇకపై viability gap funding లేకుండానే ఇండిగో సంస్థ వారంలో మూడు రోజులు.. అంటే మంగళవారం, గురువారం, శనివారం.. సింగపూర్‌కు రెగ్యులర్‌ సర్వీసులు నడపనుంది.

ఈరోజు శనివారం ఉదయం 7:30 గంటలకు గన్నవరం నుంచి మొదటి రీ-లాంచ్ ఫ్లైట్ సింగపూర్‌కు బయల్దేరింది. దీంతో ఆంధ్రప్రదేశ్ వాసులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విజయవాడ-సింగపూర్ అంతర్జాతీయ విమాన సర్వీసు కల నెరవేరినట్లు అయింది. అంతర్జాతీయ సేవలు అందుబాటులోకి రావడంతో అమరావతి రాజధాని ప్రాంతం నుంచి విదేశీ ప్రయాణాలు మరింత సులభతరం కానున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను విస్తరించేందుకు ప్రయత్నాలు వేగవంతం అయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవతో ఇండిగో సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయి.

అంతర్జాతీయ కనెక్టివిటీ పెరగడంతో వ్యాపార రంగం, విద్యార్థులు, ఎన్ఆర్‌ఐలు, టూరిజానికి ఇది ఎంతో ప్రయోజనకరంగా మారనుందని విమానాశ్రయ అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా ఈ సర్వీసుల పునఃప్రారంభంతో ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ విమాన కనెక్టివిటీలో మరో కీలక అడుగు ముందుకు వేసినట్టు అయ్యింది. ఈ కొత్త సర్వీసుతో వ్యాపార, పర్యాటక, విద్యా సంబంధిత ప్రయాణాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Take Oath As A TDP National Working President | CM Chandrababu | AG

తాజా వార్తలు

Related Videos