ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న భోగాపురం విమానాశ్రయం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు 86 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయని, 2026 జూన్ నాటికి విమాన సర్వీసులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. శనివారం ఆయన విమానాశ్రయ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నిర్మాణాన్ని చేపట్టిన జీఎంఆర్ సంస్థ వర్షాకాలంలోనూ పనులను ఆపకుండా నిరంతరాయంగా కొనసాగిస్తోందని ప్రశంసించారు. మిగిలిన 14 శాతం పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి, నిర్దేశిత గడువులోగా విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన స్పష్టం చేశారు. పనుల పురోగతిపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. విమానాశ్రయానికి అనుసంధానంగా రోడ్డు మార్గాలను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు సులువుగా చేరుకునేందుకు 7 కీలక పాయింట్లను గుర్తించామన్నారు. ఈ రహదారుల పనులను వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వివరించారు. దీనితో పాటు, ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదనలతో పాటు బీచ్ కారిడార్ నిర్మాణానికి కూడా డీపీఆర్ సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, విశాఖపట్నం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ కనెక్టివిటీని పెంచేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. విశాఖ నుంచి కొచ్చికి విమాన సర్వీసుల కోసం విజ్ఞప్తులు అందాయని, వాటిని కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. భోగాపురం విమానాశ్రయం పూర్తయితే ఉత్తరాంధ్ర ప్రాంతంలో పర్యాటకం, వాణిజ్యం గణనీయంగా అభివృద్ధి చెందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos