ఉండవల్లి: రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమని, ఇప్పటివరకు ప్రజాప్రభుత్వం కల్పించిన ప్రతి ఉద్యోగాన్ని ట్రాక్ చేయాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ఏర్పాటుచేసిన మంత్రుల ఉపసంఘం సమావేశం జరిగింది. రాష్ట్రానికి ఇప్పటివరకు వచ్చిన పరిశ్రమలు, కల్పించిన ఉద్యోగాలతో పాటు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రాజెక్టుల గ్రౌండింగ్ పై సమావేశంలో చర్చించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో యువతకు 6.25 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనకు తీసుకుంటున్న చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న 787 కంపెనీలను ట్రాక్ చేస్తాం

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 20 లక్షల ఉద్యోగాల కల్పన ప్రజాప్రభుత్వ వాగ్దానం. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ప్రతిఒక్కరు కంకణబద్దులై పనిచేయాలి. నైపుణ్యం పోర్టల్ మాదిరిగానే ప్రతిఒక్క ఉద్యోగాన్ని ఆధార్/కేవైసీ లింకేజీతో ట్రాక్ చేయాలి. మా దృష్టిలో చిన్న పరిశ్రమలు, పెద్ద పెట్టుబడులు రెండూ సమానమే. ఉద్యోగాల కల్పనే మాకు ముఖ్యం. పరిశ్రమల స్థాపన, అనుమతుల విషయంలో సింగపూర్, దుబాయ్ కంటే సులభతరంగా ఉండాలి. పరిశ్రమలకు అవసరమైన అన్ని శాఖలవారీ అనుమతులు, ఎన్వోసీలను మ్యాపింగ్ చేసి వాటి స్థితి, గడువు ట్రాకింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయాలి. పెట్టుబడులు గ్రౌండింగ్ పై అధికారులు ప్రధానంగా దృష్టిసారించాలి. సమస్యలను గుర్తించాలి. దీనిపై ప్రతివారం సమీక్షిస్తాం. ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న 787 కంపెనీలను ట్రాక్ చేస్తాం. ఈడీబీని మరింత బలోపేతం చేస్తాం. ప్రతి శాఖ ఈడీబీ ట్రాకర్ ను పర్యవేక్షించేందుకు సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ను నామినేట్ చేయాలని ఆదేశించారు. ఎంఎస్ఎంఈ పార్క్ లు, టెక్స్ టైల్ ఇండస్ట్రీకి పవర్ బ్యాంకింగ్ అంశాలపైనా సమావేశంలో చర్చించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : రాజ్యసభలో అమరావతి బిల్లు.. Capital Amaravati Bill in Rajya Sabha | PM Modi | Amaravati Galam

తాజా వార్తలు

17-06-23-0423.jpg

కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం.. మై టీడీపీ యాప్’ టాప్ 10 ఫెర్ఫార్మర్స్ తో మంత్రి లోకేష్ ఆత్మీయ భేటీ
2026-04-08 Time: 05:06:23

16-27-13-0413.jpg

రోడ్ల కనెక్టివిటీతో ఎకనామిక్ యాక్టివిటీ..  రాష్ట్ర, జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సమీక్షించిన సీఎం చంద్రబాబు
2026-04-08 Time: 04:27:13

13-37-28-0428.jpg

టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 87వ రోజు ప్రజాదర్బార్.. సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ
2026-04-08 Time: 01:37:28

11-09-34-0434.jpg

పెట్టుబడులు గ్రౌండింగ్ పై దృష్టి.. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రుల ఉపసంఘం సమావేశంలో మంత్రి లోకేష్ దిశానిర్దేశం
2026-04-08 Time: 11:09:34

18-48-56-0456.jpg

అమరావతికి చట్టబద్ధత.. ఆంధ్రప్రదేశ్ దీర్ఘకాలిక అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వాలకు స్పష్టత..  హైకోర్టు న్యాయవాదుల విజయోవత్సవ ర్యాలీలో ప్రత్తిపాటి
2026-04-07 Time: 06:48:56

Related Videos