మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్‌కు బిగ్ షాక్ తగిలింది. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌కు రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 13 వరకు రిమాండ్ విధిస్తున్నట్టుగా తెలిపింది. జోగి రమేష్‌తో పాటు ఆయన సోదరుడు జోగి రాముకు కూడా కోర్టు రిమాండ్ విధించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్దన్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు మరింత విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే పలు ఆధారాలు సేకరించిన పోలీసులు జోగి రమేశ్ అరెస్ట్‌కు రంగం సిద్దం చేశారు. ఆదివారం తెల్లవారుజామునే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ నివాసానికి ఎక్సైజ్ శాఖ, నకిలీ మద్యం కేసును విచారిస్తున్న సిట్, స్థానిక పోలీసులతో కూడిన సంయుక్త బృందం వెళ్లింది. అయితే తొలుత ఇంటిని సెర్చ్ చేయనున్నట్టుగా నోటీసులు ఇచ్చారు.

ఆ తర్వాత జోగి రమేష్‌ను, ఆయన సోదరుడు జోగి రామును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు అరెస్ట్ నోటీసు అందించారు. అరెస్టు తర్వాత జోగి రమేష్‌ను విజయవాడలోని గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ దాదాపు 10 గంటలకు పైగానే జోగి రమేష్‌ను సిట్ అధికారులు ప్రశ్నించారు. మరోవైపు జోగి రామును కూడా పోలీసులు విచారించారు. నకిలీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న జనార్దన్‌ రావుతో పరిచయం, సంబంధాల గురించి వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. విచారణ అనంతరం జోగి రమేష్, రాములను వైద్య పరీక్షలకు తరలించారు. 

వైద్య పరీక్షలు పూర్తయ్యాక జోగి సోదరులను కోర్టుకు తీసుకొస్తున్నారని తెలిసి వైసీపీ మాజీ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, నేతలు అక్కడకు తరలివచ్చారు. వారితో కోర్టు హాలు నిండిపోయింది. మేజిస్ట్రేట్‌ లెనిన్‌బాబు రాత్రి 11.30కి కోర్టుకు వచ్చారు. కోర్టు హాలు కిక్కిరిసి ఉండడం చూశారు. సూర్యారావుపేట ఇన్‌స్పెక్టర్‌ మహ్మదాలీని తన చాంబరుకు పిలిపించుకున్నారు. న్యాయవాదులు కానివారు బయటకు వెళ్తేనే కోర్టు హాలులోకి వస్తానని స్పష్టంచేశారు. దీంతో ఆయన తన సిబ్బందితో లోపలకు వెళ్లి వైసీపీ నేతలందరినీ బయటకు వెళ్లాలని సూచించారు. ఈ క్రమంలోనే జోగి రమేష్, రాములకు ఈ నెల 13 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు వెలువరించారు. దీంతో జోగి రమేష్, జోగి రాములను విజయవాడ జైలుకు తరలించారు. ఇక, ఈ కేసులో నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌ పేరును ఏ-18 గా, ఆయన సోదరుడు జోగి రామును ఏ-19 గా అధికారులు పేర్కొన్నారు. 

ఇదిలాఉంటే, అక్టోబర్ 3వ తేదీన అన్నమయ్య జిల్లా ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ కేంద్రం బయటపడటం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మూడు రోజుల వ్యవధిలోనే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీం పట్నంలో మరో నకిలీ మద్యం తయారీ కేంద్రం గుట్టు రట్టు అయింది. ఈ క్రమంలోనే ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసులో అద్దేపల్లి జనార్దన్ రావును ప్రధాన నిందితుడిగా చేర్చారు. అయితే ఆ సమయంలో ఆఫ్రికాలో ఉన్న జనార్దన్ రావు అక్టోబర్ 10న విజయవాడ చేరుకోగానే అరెస్ట్ చేశారు. ఈ కేసులో పలువురు ఇతర నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. జోగి రమేష్ ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారీ జరిగిందని జనార్దన్ రావు ఆరోపించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జోగి రమేష్ మళ్లీ తనకు ఫోన్ చేశారని, నకిలీ మద్యం తయారు చేయాలని చెప్పారని అన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos